Sreeleela Movie Offers: టాలీవుడ్‌లో దూసుకెళ్తోన్న శ్రీలీల.. హీరోయిన్లకు నిద్రలేకుండా చేస్తోన్న ముద్దుగుమ్మ..!
Sreeleela Movie Offers: టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ధమాకా ఇచ్చిన సక్సెస్‌తో ఈ ముద్దుగుమ్మ వద్దకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల పక్కన కూడా అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ.
Sreeleela Movie Offers: ధమాకా లాంటి సక్సెస్‌తో టాలీవుడ్‌లో మంచి జోరు మీదుంది శ్రీలీల. రవితేజ సరసన ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగులో వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుటూ దూసుకెళ్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ ముద్దుగుమ్మ చేతిలో 8 సినిమాలు ఉండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది శ్రీలీల. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ రీతిలో కెరీర్ పరంగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్తోంది.
తొలుత కొన్ని కన్నడ సినిమాలతో చిత్రసీమంలో అరంగేట్రం చేసిన శ్రీలీల పెళ్లి సందడి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ప్రస్తుతం వరుసు పెట్టి సినిమాలకు సంతకం చేస్తూ అదరగొట్టింది. చిన్న హీరోలే కాదు ఈ అమ్మడు చేతిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా ఆఫర్ దక్కించుకుందని సమాచారం. ఇది కాకుండా మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMN28లోనూ సెకండ్ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న NBK108లోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుందట. ఇందులో బాలకృష్ణకు కూతురు పాత్ర పోషిస్తుందని సమాచారం. వీటితోపాటు బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాలో, నితిన్ 32లో, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రోజు, వైష్ణవ్ తేజీ పీవీటీ04లోనూ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తుందట. ఇది కాకుండా గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర హీరోయిన్ల కంటే కూడా శ్రీలీల ఈ విధంగా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. కెరీర్ ఆరంభంలో పూజా హెగ్డే, రష్మిక మందన్నాకు కూడా ఇదే విధంగా వరుస ఆఫర్లు వచ్చాయి. ఏక కాలంలో అరడజనుకు పైగా చిత్రాలతో వీరిద్దరూ టాలీవుడ్‌లో స్టార్ హోదాను అనుభవించారు. తాజాగా శ్రీలీల కూడా వీరి మార్గంలోనే దూసుకెళ్తోంది. అయితే ఇంత త్వరగా పవన్ కల్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో శ్రీలీలకు అవకాశం రావడం మిగిలిన హీరోయిన్లను షాక్‌కు గురిచేస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్