Raghunandhan Rao On KTR : ఆరడుగుల హరీశ్ రావు ఏం చేయలేకపోయే, పొట్టోడివి నువ్వేం పీకుతావ్- కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్
Raghunandhan Rao On KTR : కేసీఆర్ పేరు పక్కన పెడితే కేటీఆర్ మీద రూపాయి పెడితే పావలాకు కూడా ఎవరూ కొనరని రఘునందన్ రావు విమర్శించారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కేటీఆర్ అన్నారు.
Raghunandhan Rao On KTR : 173 ఓట్లతో గెలిచిన కేటీఆర్ 1700 ఓట్లతో గెలిచిన నన్ను విమర్శిస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సెటైర్లు వేశారు. కేటీఆర్ తిట్టిన తిట్లు రఘునందన్ రావుని తిట్టినట్లు కాదని, దుబ్బాక ప్రజల ఆత్మభిమానం మీద దెబ్బకొట్టినట్టు అని మండిపడ్డాడు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిoచే వరకు సిరిసిల్లలో ఎవరు గెలిచారో తెలియలేదని, అలా గెలిచిన కేటీఆర్ నన్ను తిట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నటు తండ్రి పేరు చెప్పుకుని కేటీఆర్ గెలిచారంటూ విమర్శించారు. చేగుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి హోదాలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్న తనపై సంస్కారం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. దుబ్బాక ప్రజల గురించి, దుబ్బాక ఎమ్మెల్యే గురించి అవాకులు, చవాకులు మాట్లాడితే రఘునందన్ చూస్తూ ఊరుకోడని హెచ్చరించాడు. కేసీఆర్ పేరు పక్కన పెడితే కేటీఆర్ మీద రూపాయి పెడితే పావలాకు కూడా ఎవరూ కొనరని విమర్శించారు. దుబ్బాకలో రఘునందన్ రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు
తెలంగాణ ప్రభుత్వం 2018 మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి 3016 ఎందుకు ఇవ్వలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. 2018 మేనిఫెస్టోలో డబుల్ బెడ్ రూములు, రైతు రుణమాఫీ వెంటనే చెయ్, ఆ తర్వాత నన్ను ప్రశ్నించు అని రఘనందన్ రావు కేటీఆర్ కు సవాల్ విసిరారు. రఘునందన్ రావు పుస్తె మెట్టెలు ఇస్తానని ఇచ్చిండా అని కేటీఆర్ ఆరోపించారు, ఆయన దుబ్బాకకు వస్తే ఊరికి ఒక్కటైనా ఇవ్వకపోతే ఏది చేయమంటే దానికి ఒప్పుకుంటానని రఘునందన్ రావు అన్నారు.
నేను మీలాగా మోసం చేసేవాడిని కాదని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వారిని జై తెలంగాణ అన్నవారిని ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ గౌరవించిందా అని ప్రశ్నించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంతాచారి తల్లి ఎక్కడ అని నిలదీశారు. దుబ్బాక సోలిపేట లింగారెడ్డి టికెట్ ఎంతకు అమ్ముకున్నారని, ఎవరికి అమ్ముకున్నారని కేటీఆర్ ను రఘునందన్ రావు ప్రశ్నించారు. దుబ్బాక ప్రజల ఆత్మభిమానాన్ని దెబ్బతీసి దుబ్బాక ప్రజలు గెలిపించిన నన్ను వాడు, వీడు అన్న నీ సంస్కారం ఇదేనా అంటూ వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పోయినసారి ఎన్నికలలో ఆరడుగుల హరీశ్ రావు వచ్చి ఏం చేయలేదని ఇప్పుడు పొట్టోడివి నువ్వేం పీకుతావని మండిపడ్డారు.