Licensed Weapons Deposit : ఠాణాకు చేరిన లైసెన్డ్స్ ఆయుధాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 263 వెపన్స్-karimnagar 201 licensed weapons deposited in police station due to election code ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Licensed Weapons Deposit : ఠాణాకు చేరిన లైసెన్డ్స్ ఆయుధాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 263 వెపన్స్

Licensed Weapons Deposit : ఠాణాకు చేరిన లైసెన్డ్స్ ఆయుధాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 263 వెపన్స్

HT Telugu Desk HT Telugu
Apr 24, 2024 08:19 PM IST

Licensed Weapons Deposit : ఎన్నికల కోడ్ నేపథ్యంలో లైసన్స్ కలిగిన ఆయుధాలను పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న 201 ఆయుధాలను ఠాణాల్లో డిపాజిట్ చేశారు.

ఠాణాకు చేరిన లైసెన్డ్స్ ఆయుధాలు
ఠాణాకు చేరిన లైసెన్డ్స్ ఆయుధాలు

Licensed Weapons Deposit : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ కలిగిన ఆయుధాలు (Licensed Weapons )ఠాణాకు చేరాయి. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో 263 లైసెన్సుడ్ ఆయుధాలున్నాయి. ఇందులో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న 201 ఆయుధాలను సంబంధిత వ్యక్తులు పోలీస్ స్టేషన్(Police Station) లో డిపాజిట్ చేశారు. మిగతా 62 ఆయుధాలను వివిధ బ్యాంకులు(Banks), ప్రభుత్వరంగ సంస్థల భద్రత కోసం వినియోగిస్తున్నారు. అప్పగించిన ఆయుధాలను లైసెన్సుదారులు జూన్ 7న తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికే లైసెన్సు కలిగిన ఆయుధాలను అప్పగించాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆలోపే పోలీసు శాఖ నుంచి వెళ్లిన సమాచారం మేరకు లైసెన్సు దారులు తమ పరిధిలోని ఠాణాలకు అప్పగించారు.

లైసెన్సు కలిగిన ఆయుధాలు అప్పగించినవి

కరీంనగర్ జిల్లాలో లైసెన్సు కలిగిన ఆయుధాలు (Licensed Weapons)114, ఇప్పటి వరకూ 89 పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లాలో 61 లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉండగా 44, జగిత్యాల జిల్లాలో 56 లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉండగా 45, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 32 లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉండగా 23 సంబంధిత పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు. వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకుని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) సందర్భంగా ఆయుధాలను అప్పగించాలని పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు వంద శాతం డిపాజిట్ చేశారు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం వ్యక్తిగత తుపాకీ లైసెన్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో ఆయుథాలను అప్పగించాల్సి ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో ఈ నిబంధన అమలులో ఉంది.

వ్యక్తిగత భద్రత కోసం లైసెన్స్

వ్యక్తిగత భద్రత(Self Protection) కోసం ఎవరైనా ఆయుధాలు పొందే అవకాశం ఉంది. 1959 చట్టం ప్రకారం తుపాకీ లైసెన్సు కావాలనుకునే వారు ముందుగా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. అతడికి ప్రాణహాని ఉందా? అన్న విషయాన్ని ఆ ప్రాంత ఠాణా పరిధి పోలీసులు పరిశీలిస్తారు. ఆ వివరాలను సీఐ, డీఎస్పీ, ఎస్పీలకు నివేదిస్తారు. ఈ మేరకు కలెక్టర్ లైసెన్సు మంజూరు చేస్తారు. సాధారణంగా రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు, గుత్తేదారులు ఎక్కువగా ఆయుధ లైసెన్సులు తీసుకుంటారు. లైసెన్సు పొందిన వ్యక్తులు నాన్ ప్రొహిబిటెడ్ బోర్ (ఎన్పీబీ) తుపాకులను మాత్రమే కొనుగోలు చేయాలి. కేవలం ఆత్మరక్షణ కోసమే వాటిని వినియోగించాలి. వ్యక్తి గత ప్రయోజనాల కోసం, ఇతరులను బెదిరించడానికి ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల సమయంలో తప్పకుండా ఠాణాల్లో అప్పగించాలి.

HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

Whats_app_banner