Lok Sabha elections : తొలి దశ పోలింగ్​ జరగకముందే భారీగా నగదు పట్టివేత.. 2019 ఎన్నికలను దాటేసిన లెక్కలు!-election commission seizes record 4 650 crore ahead of 2024 lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections : తొలి దశ పోలింగ్​ జరగకముందే భారీగా నగదు పట్టివేత.. 2019 ఎన్నికలను దాటేసిన లెక్కలు!

Lok Sabha elections : తొలి దశ పోలింగ్​ జరగకముందే భారీగా నగదు పట్టివేత.. 2019 ఎన్నికలను దాటేసిన లెక్కలు!

Sharath Chitturi HT Telugu
Apr 15, 2024 06:20 PM IST

Election Commission of India : 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో 'అక్రమ నగదు పట్టివేత' విషయంలో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి! ఎన్నికల ప్రారంభానికి ముందే.. ఇప్పటివరకు జప్తు చేసిన నగదు… 2019 లోక్​సభ ఎన్నికల లెక్కలను దాటిపోవడం గమనార్హం.

అక్రమ నగదు పట్టివేతపై ఎన్నికల సంఘం డేటా..
అక్రమ నగదు పట్టివేతపై ఎన్నికల సంఘం డేటా..

2024 Lok Sabha elections : 2024 లోక్​సభ ఎన్నికల్లో ఇప్పటివరకు జప్తు చేసిన అక్రమ నగదు, ఇతర వస్తువులకు సంబంధించిన డేటాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఇందులో పలు షాకింగ్​ విషయాలు బయపడ్డాయి. మొత్తం మీద చూసుకుంటే.. 2024 లోక్​సభ ఎన్నికల తొలి దశ పోలింగ్​ ప్రారంభం అవ్వకముందే.. జప్తు చేసిన నగదు.. 2019 సార్వత్రిక ఎన్నికల లెక్కలను దాటేయడం గమనార్హం!

ఎన్నికల సంఘం జప్పు చేసిన నగదు..

ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలు.. ఇప్పటివరకు రూ. 4,650 కోట్లను జప్తు చేసినట్టు, ఇదొక రికార్డు అని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2019 లోక్​సభ ఎన్నికల మొత్తం మీద రూ. 3,474 కోట్లు పట్టుబడినట్టు తెలిపింది.

"ఈస్థాయిలో డబ్బులు పట్టుకుంటుండటం.. ఈసీ నిబద్ధతకు ఉదాహరణ. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు మేము నిరంతరం, తీవ్రంగా కృషి చేస్తున్నాము," అని ఎన్నికల సంఘం పేర్కొంది.

Lok Sabha elections money seized data : "2024 లోక్​సభ ఎన్నికల తొలి దశకు ముందు జప్తు చేసిన వాటిల్లో 45శాతం డ్రగ్స్​, నార్కోటిక్స్​ ఉన్నాయి. వీటిపైనే ఎన్నికల సంఘం అధిక దృష్టి పెట్టింది. పక్కా ప్రణాళిక, కొలాబొరేషన్​, దర్యాప్తు సంస్థ కృషి, ప్రజల మద్దతు, టెక్నాలజీ సాయంతో మేము నగదుతో పాటు ఇతర వస్తువులను జప్తు చేయగలుగుతున్నాము," అని ఎన్నికల సంఘం వెల్లడించింది.

అంతేకాదు.. రాష్ట్రాలవారీగా పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది ఎన్నికల సంఘం. ఈ జాబితాలో రూ. 778కోట్ల అక్రమ నగదుతో రాజస్థాన్​ టాప్​లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్​ (రూ. 605 కోట్లు), మహారాష్ట్ర (రూ. 431 కోట్లు) ఉన్నాయి.

'ఎన్నికల్లో అక్రమ కార్యకలాపాలను సహించబోము..'

Lok Sabha elections 2024 : గత నెలలో 2024 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేస్తున్న సమయంలో.. పలు కీలక వ్యాఖ్యాలు చేశారు చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​. మనీ పవర్​ను అడ్డుకుంటామని చెప్పారు. తమకు సవాలుగా ఉన్న 4ఎంలపై (మనీ, మజిల్​, మిస్​- ఇన్​ఫర్మేషన్​, మోడల్​ కోడ్​ ఆఫ్​ కాండక్ట్​ ఉల్లంఘన) కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణలో.. నగదును జప్తు చేయడం కీలకం అని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఎలక్టోరల్​ ప్రాక్టీసులు పారదర్శకంగా ఉండాలని పేర్కొంది.

ఇక 2024 లోక్​సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్​ 19న తొలి దశ పోలింగ్​ జరగనుంది. జూన్​ 4న ఫలితాలు వెలువడనున్నాయి. లోక్​సభ ఎన్నికలతో పాటు అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​లోనూ ఈసారి పోలింగ్​ జరగనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం