Nallari on Peddireddy: "పెద్దిరెడ్డి.. పదవి కోసం కాళ్లు పట్టుకున్నావు మర్చిపోయవా! " అని ప్రశ్నించిన నల్లారి
Nallari on Peddireddy: డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడని మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న నల్లారి, పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Nallari on Peddireddy: ‘డీసీసీ అధ్యక్ష పదవి కోసం రెండుసార్లు నా కాళ్లు పట్టుకున్న సంగతి మరిచిపోయావా? నా కాళ్లు పట్టుకున్నావని నేను కాణిపాకంలో గానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, పట్టుకోలేదని ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా?’ అని మంత్రి Peddireddy పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాజీ సీఎంNallari నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సవాలు చేశారు.
రాజంపేట Rajampet బీజేపీ BJP ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత కొద్ది రోజులుగా నల్లారిపై పెద్దిరెడ్డి పలు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డే కారణమని ఆరోపిస్తున్నారు. రాజంపేటలో పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాజంపేట అభ్యర్థిగా పోటీచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి …అన్నమయ్య జిల్లా పీలేరు Peeleru నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ముఖ్యమంత్రి పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నానని మంత్రి పెద్దిరెడ్డి పదేపదే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పదవుల కోసం ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టే మనస్తత్వం తనది కాదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీసీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి వాయల్పాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు.
ఓ రోజు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసి, కార్యకర్తలతో మాట్లాడుతున్న క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. డీసీసీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తూ కాళ్లు పట్టుకున్నారని చెప్పారు. వయసులో పెద్దవారు అలా చేయొద్దని తాను వారించినట్టు చెప్పారు.
పెద్దిరెడ్డి చేసిన పనికి తాను షాక్‌కు గురయ్యానని మరుసటి రోజు ఉదయం 6 గంటలకే గెస్ట్‌హౌస్‌కు వచ్చి ‘రాత్రి మద్యం మత్తులో కాళ్లు పట్టుకున్నానని అనుకుంటావేమోనని మళ్లీ వచ్చానని చెప్పారని, కాళ్లు పట్టుకుంటా నాకు మద్దతు ఇవ్వమని పెద్దిరెడ్డి మరోసారి కాళ్లు పట్టుకున్నారన్నారు.
పదవి కోసం పెద్దిరెడ్డి చేసిన పని గురించి చెప్పడం సంస్కారం కాదని భావించానని, ఎవరి తీరు ఏమిటో బహిర్గతం చెబుతున్నానని వివరించారు. ఇంతకాలం ఓపిక పట్టానని, ఎవరి నైజం ఏమిటో ప్రజలకు తెలియ జేసేందుకే ఇష్టం లేకపోయినా చెబుతున్నానన్నారు. అధికార మదంతో పదేపదే తనపై విమర్శలు చేస్తుంటే తట్టుకోలేక పాత విషయాలు బయటపెట్టానని చెప్పారు.
చిత్తూరులో భారీగా మద్యం స్వాధీనం…
చిత్తూరు జిల్లా పుత్తూరులో భారీగా మద్యం పట్టుబడింది. ప్రైవేటు కళాశాలలో డంప్ చేసిన మద్యం కేసులను వైసీపీ నాయకులు దాచి పెట్టడంతో పట్టుకున్నారు. నగరిలో రోజా నామినేషన్ నేపథ్యంలో మద్యం డంప్ బయటపడటంతో అనుమానాలు వ్యక్తం అుతున్నారు.
మద్యం తరలిస్తూ న పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు పట్టుబడ్డారు. శ్రీ విద్యా డిగ్రి కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం దాచినట్టు సమచారం రావడంతో తనిఖీలు చేపట్టారు. కళాశాల యజమాని సోదరి పుత్తూరు పురపాలక సంఘ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ రాజేష్‌రెడ్డికి చెందిన కారు షెడ్డుపై ఎస్‌ఈబీ అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం దాడి చేసింది. ఆ సమయంలో షెడ్డులో ఉన్న వ్యక్తిని విచారించడంతో షెడ్డు డిప్యూటీ మేయర్ రాజేష్‌రెడ్డిదని చెప్పడంతో అధికారులు దానిని వీడియో తీసుకున్నారు. 170 కేసుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకోగా విలువ రూ.10.28 లక్షలు ఉంటుందని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం