Election Rules: ఏపీలో ఎన్నికల సంఘం నిబంధనలపై పార్టీల అసంతృప్తి.. ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి!-discontent of political parties over election commission restrictions on door to door campaigning ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Rules: ఏపీలో ఎన్నికల సంఘం నిబంధనలపై పార్టీల అసంతృప్తి.. ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి!

Election Rules: ఏపీలో ఎన్నికల సంఘం నిబంధనలపై పార్టీల అసంతృప్తి.. ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి!

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 08:49 AM IST

Election Rules: ఏపీలో ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇంటింటి ప్రచారానికి కూడా అనుమతి తప్పనిసరి చేయడాన్ని తప్పు పడుతున్నారు.

ఇంటింటి ప్రచారంపై ఎన్నికల సంఘం ఆంక్షలు
ఇంటింటి ప్రచారంపై ఎన్నికల సంఘం ఆంక్షలు

Election Rules: అనుమతి లేకుండా ఎన్నికల Elections వేళ ఇంటింటి ప్రచారం Campaign చేపడితే కేసులు తప్పవని ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఏపీలో రాజకీయ పార్టీలు ఖంగుతినాల్సి వచ్చింది. గతంలో ఎన్నడు లేని Restrictions ఆంక్షలు, తాజా ఎన్నికల్లో ఇంటింటి ప్రచారంపై విధించడంతో రాజకీయ పార్టీలన్ని అభ్యంతరం తెలిపాయి.

మంగళవారం ఏపీ సచివాలయంలో ఎన్నికల సంఘం ఏపీ ప్రధాన అధికారి నిర్వహించిన సమావేశంలో ఇంటింటి ప్రచారానికి 48 గంటల ముందే రూట్ మ్యాప్ అందచేయాలని, Suvidha App సువిధ యాప్‌లో అనుమతులు తీసుకోవాలని చెప్పడంతో పార్టీలు అభ్యంతరం తెలిపాయి.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటి వెళ్లి ఎన్నికల్లో కరపత్రాల పంపిణీ చేయడానికి వీధుల్లో ప్రచారానికి కూడా 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను పున : పరిశీలించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి.

ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబందన ఆచరణ సాధ్యం కాదని సిపిఎం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల వద్ద కూడా పార్టీ జెండాలను తొలగించడంపై సిపిఎం అభ్యంతరం తెలిపింది. కార్యాలయాల్లో బ్యానర్లు, జెండాలను తొలగించడంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

మేడే కార్యక్రమాల నిర్వహణకు ఆంక్షలు లేకుండా అనుమతించాలని వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు జెండాపోల్స్‌, జెండా దిమ్మెలు తొలగించిన అధికారులుపై చర్యలు తీసుకోవాలని, ఇతర జిల్లాల్లో తొలగించకుండా ఆదేశాలివ్వాలని సీఈఓను కోరారు.

సువిధాలో నమోదు తప్పనిసరి… ఎంకె. మీనా(ఈసీ సీఈఓ ఏపీ)

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందడానికి సువిధా పోర్టల్ వినియోగించు కోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు.

ప్రచారానికి 48 గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా సంబందిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తారని చెప్పారు.

ఆన్లైన్‌లో నామినేషన్లు, అఫిడవిట్ లను దాఖలు చేయడానిక, ముందస్తు అనుమతులు మంజూరు చేయడానికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేందుకు సువిధా పోర్టల్ ను ఈసీఐ డిజైన్ చేసినట్టు మీనా వివరించారు.

రాజకీయ పార్టీల అభ్యంతరం…

48గంటల నిబంధనపై రాజకీయ పార్టీలన్నీ అభ్యంతరం తెలిపాయి. ప్రతిసారి రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసుకుని ఇంటింటి ప్రచారం చేపట్టడం సాధ్యం కాదని పేర్కొన్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలో ఈ తరహా నిబంధనలు లేవని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం రాలేదని పార్టీలు గుర్తు చేశాయి.

మరోవైపు టీడీపీ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం సీఈఓ స్పందించడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు. ప్రతిసారి అనుమతతులు తీసుకోవటం అభ్యంతరకరమని సీఈ ఓకి చెప్పామన్నారు. ఇంటింటి ప్రచారంపై ఆంక్షలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారన్నారు. అధికార పార్టీపై ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీ విజిల్ ‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన స్పందన రావడం లేదన్నారు.

ఇంటింటి ప్రచారానికి అనుమతులపై వైసీపీ కూడా అభ్యంతరం తెలిపింది. అభ్యర్థులు ఎక్కడకు వెళుతున్నారో 48గంటల ముందే చెప్పడం కష్టమని, పాంప్లెట్లకు కూడా అనుమతి తీసుకోవాలంటే సాధ్యం కాదని సీఈఓకు వివరించినట్టు ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. 48 గంటల నిబంధన సడలించాలని కోరామన్నారు.

 

సంబంధిత కథనం