నియోజకవర్గం పేరు -
ఇంకా చదవండి
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం(175)కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. కుప్పంకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ శాసనసభ నియోజకవర్గం చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. కుప్పం శాసనసభ నియోజకవర్గంలో... కుప్పం, గుడిపల్లె, రామకుప్పం, వెంకటగిరి కోట, శాంతిపురం మండలాలు ఉన్నాయి. కుప్పం శాసన సభ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. తొలి ఎన్నికలలో స్వాతంత్ర్య సమరయోధుడు డి.రామబ్రహ్మం విజయం సాధించారు. 1962లో సీపీఐకు చెందిన వజ్రవేలు శెట్టి గెలుపొంది. 1967, 1972లలో వరసగా రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థి డి.వెంకటేశం విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ ఆవిర్భావం నుంచి కుప్పంలో ఆ పార్టీదే విజయం. 1983, 85లలో టీడీపీ అభ్యర్థి రంగస్వామి నాయుడు గెలవగా, 1989 నుంచి 2019 వరకూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(102,952 ఓట్లు) వైసీపీ అభ్యర్థి కె. చంద్రమౌళి(55,839 ఓట్లు)పై 47,121 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(100,146 ఓట్లు) వైసీపీ అభ్యర్థి కె. చంద్రమౌళి(69,424 ఓట్లు)పై 30,722 మెజార్టీతో గెలుపొందారు.
2024 అభ్యర్థులు
పోలింగ్ డేట్ - 13 May 2024
- పార్టీ పేరుఅభ్యర్థి పేరు
Not Announced Yet