Xiaomi 13 Series launch date: షావోమీ కొత్త ఫ్లాగ్‍షిప్ మొబైల్ సిరీస్ లాంచ్ డేట్ ఖరారు.. పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో..
Xiaomi 13 Series launch date: షావోమీ 13 సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో ఈ ప్రీమియమ్ సిరీస్ ఫోన్లు రానున్నాయి.
Xiaomi 13 Series launch date: పాపులర్ బ్రాండ్ షావోమీ.. కొత్త ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‍ను తెచ్చేందుకు సిద్ధమైంది. షావోమీ 13 సిరీస్ లాంచ్ డేట్‍ను వెల్లడించింది. డిసెంబర్ 1వ తేదీన చైనాలో ఈ ఫ్లాగ్‍షిప్ సిరీస్ ఫోన్లు అడుగుపెట్టనున్నాయి. ఇండియాకు కూడా ఈ మొబైళ్లు వస్తాయి. షావోమీ 13 సిరీస్‍ను డిసెంబర్ 1న చైనా మార్కెట్‍లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించిన షావోమీ.. కొన్ని ఫీచర్లను కూడా టీజ్ చేసింది. ఈ సిరీస్‍లో షావోమీ 13, షావోమీ 13 ప్రో ఫోన్లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా క్వాల్‍కామ్ పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్ ఈ ఫోన్‍లలో ఉంటుంది. వివరాలివే..
స్పెసిఫికేషన్లు
Xiaomi 13 Series Specifications: షావోమీ 13 సిరీస్ గురించి కొన్ని వివరాలను ఆ సంస్థ టీజ్ చేసింది. ముఖ్యంగా స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, లీకా (Leica) బ్రాండెడ్ కెమెరా సెన్సార్లను హైలైట్ చేస్తోంది. ప్రీమియమ్ డిజైన్‍ను షావోమీ 13 కలిగి ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్‍తో వస్తుంది. కాగా షావోమీ 13కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు లీక్‍ల ద్వారా బయటికి వచ్చాయి.
6.2 ఇంచుల 2కే రెజల్యూషన్ అమోలెడ్ డిస్‍ప్లేతో షావోమీ 13 వస్తుంది సమాచారం. 120Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది.
షావోమీ 13 సిరీస్ ఫోన్ల వెనుక 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలు ఉంటాయని లీక్‍ల ద్వారా వెల్లడైంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలీ ఫొటో కెమెరాలతో రావొచ్చు. 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఫ్రంట్ కెమెరాగా ఉండే అవకాశం ఉంది.
ఇంకేం లాంచ్ కానున్నాయంటే..
Xiaomi 13 series launch event: డిసెంబర్ 1వ తేదీన షావోమీ 13 సిరీస్‍తో పాటు మరికొన్ని లాంచ్ కానున్నాయి. షావోమీ వాచ్ ఎస్2, షావోమీ బడ్స్ 4 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అడుగుపెట్టనున్నాయి. అలాగే ఎంఐయూఐ 14ను కూడా అదే రోజు లాంచ్ చేయనుంది షావోమీ. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‍డేట్‍ను ఇవ్వనుంది. షావోమీ 13 సిరీస్ ఫోన్లు ఎంఐయూఐ 14తోనే విడుదలయ్యే అవకాశం ఉంది.