Wipro's Q3 profit up: అంచనాలను మించిన విప్రో లాభాలు
Wipro's Q3 profit up: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3) విప్రో (Wipro) సంస్థ లాభాలు అంచనాలను మించాయి. ఈ త్రైమాసికంలో విప్రో లాభాలు Q2 తో పోలిస్తే 2.8% పెరిగాయి.
Wipro's Q3 results: బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న భారతీయ దిగ్గజ ఐటీ సర్వీసెస సంస్థ విప్రో (Wipro's Q3 results) ఈ ఆర్థిక సంవత్సరం Q3లో అంచనాలను మించిన ఫలితాలను రాబట్టింది.
Wipro's Q3 profit up: 30.53 బిలియన్లు..
2022 అక్టోబర్ - డిసెంబర్ కాలానికి చెందిన Q3లో విప్రో (Wipro's Q3 results) లాభాలు రూ. 30. 53 బిలియన్లని (($375.27 million)) సంస్థ శుక్రవారం ప్రకటించింది. అంటే, సుమారు 3530 కోట్ల రూపాయలు. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 2.8% అధికం. ఈ Q3లో విప్రో (Wipro's Q3 results:) లాభాలు సుమారు రూ. 29 బిలియన్లు, అంటూ సుమారు 2900 కోట్ల రూపాయలు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, వారి అంచనాలను మించిన ఫలితాలను విప్రో (Wipro) ప్రకటించింది. సంస్థ ఆదాయం Q2తో పోలిస్తే, 14% పెరిగిందని వెల్లడించింది.
Wipro's Q3 results: ఐటీ సర్వీసెస్ (IT services) బిజినెస్ ద్వారా..
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే 2023, మార్చి 31 నాటికి ఐటీ సర్వీసెస్ (IT services) బిజినెస్ ద్వారా ఆర్జించే ఆదాయం 11.5% నుంచి 12% వరకు పెరుగుతుందని విప్రో (Wipro) భావిస్తోంది. ఈ Q3లో ఐటీ సర్వీసస్ (IT services) నుంచి 2.80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని విప్రో సముపార్జించింది. ఈ Q3లో విప్రో ఆర్డర్ బుకింగ్స్ 26% పెరగడం గమనార్హం. ఈ Q3లో ఇప్పటికే హెసీఎల్ టెక్(HCLTech), ఇన్ఫోసిస్(Infosys)లు అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించగా, తాజాగా, అదే బాటన విప్రో ((Wipro)) కూడా పయనించింది. టీసీఎస్(Tata Consultancy Services) మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
టాపిక్