Wipro Q2 results: విప్రో నికర లాభంలో 9.6 శాతం తగ్గుదల-wipro q2 net drops 9 6 percent to rupees 2649 crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Wipro Q2 Results: విప్రో నికర లాభంలో 9.6 శాతం తగ్గుదల

Wipro Q2 results: విప్రో నికర లాభంలో 9.6 శాతం తగ్గుదల

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 04:12 PM IST

Wipro Q2 results: విప్రో నికర లాభంలో 9 శాతం తగ్గుదల నమోదైంది.

<p>విప్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (ఫైల్ ఫోటో)</p>
విప్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (ఫైల్ ఫోటో) (PTI)

Wipro Q2 results: 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విప్రో నికర లాభం 9.6 శాతం తగ్గింది. అమెరికాయేతర మార్కెట్లలో క్లయింట్ల నుంచి ఆదాయం తగ్గడంతో నికర లాభం తగ్గింది.

జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 2,649.1 కోట్లుగా చూపింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 2,930 కోట్లుగా ఉంది.

కంపెనీ రెవెన్యూ రూ. 22,539.7 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాది జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో ఇది రూ. 19,667.4 కోట్లుగా ఉంది.

కంపెనీ ఆదాయం యూరప్ ప్రాంతంలో దెబ్బతిన్నంది. ఇక్కడ రూ. 918.6 కోట్ల నుంచి రూ. 787.5 కోట్లకు తగ్గింది.

అలాగే ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (ఏపీఎంఈఏ) రీజియన్‌లో కూడా ఆదాయం తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 302.8 కోట్ల మేర ఉండగా.. ఇప్పుడు రూ. 219.4 కోట్లుగా ఉంది.

Whats_app_banner