WhatsApp: ఇలాంటి నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా! జాగ్రత్త-whatsapp scam receiving whatsapp call from unknown international numbers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: ఇలాంటి నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా! జాగ్రత్త

WhatsApp: ఇలాంటి నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా! జాగ్రత్త

Chatakonda Krishna Prakash HT Telugu
May 07, 2023 08:41 PM IST

WhatsApp Scam: ఇటీవల ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి చాలా మందికి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. వివిధ దేశాల కోడ్‍లతో ఈ నంబర్లు ఉన్నాయి.

WhatsApp: ఇలాంటి నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా! జాగ్రత్త
WhatsApp: ఇలాంటి నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా! జాగ్రత్త (HT_PRINT)

WhatsApp Scam : ప్రపంచంలో వాట్సాప్.. అత్యంత పాపులర్ మెసేజింగ్ యాప్. కోట్లాది మంది నిత్యం ఈ యాప్ వినియోగిస్తుంటారు. అందుకే కొందరు సైబర్ నేరస్థులు కూడా వాట్సాప్ ద్వారా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రజలను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా కొత్త మార్గంలో వాట్సాప్ ద్వారా ప్రజలను మోసం (Cyber Crime) చేసేందుకు స్కామర్లు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వాట్సాప్ యూజర్లను బురుడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలివే..

WhatsApp Scam : ఇథియోపియా (+251), మలేషియా (+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), వియత్నాం (+84) సహా వివిధ దేశాల కోడ్‍లు ముందు ఉండే ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి భారత్‍లో వాట్సాప్ యూజర్లకు ఇటీవల కాల్స్ వస్తున్నాయి. అయితే అవి కచ్చితంగా ఆ దేశాల నుంచి వస్తున్నాయని కూడా చెప్పలేం. ఇంటర్నెట్ ద్వారా ఈ దేశాల కోడ్‍లను ఉపయోగించి కొందరు సైబర్ నేరస్థులు.. వాట్సాప్ యూజర్లకు ఈ కాల్స్ చేస్తుండొచ్చు. దేశంలోని స్కామర్లకు కొన్ని కంపెనీలు ఈ ఇంటర్నేషనల్ నంబర్స్ విక్రయించి ఉండొచ్చని కూడా ఓ రిపోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. తమకు ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని చాలా మంది యూజర్లు.. ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

WhatsApp Scam: “సీరియస్‍గా ఇది మన చేతులు దాటిపోతోంది!!! అన్‍నౌన్ ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి నాకు ఈ స్కామ్ వాట్సాప్ కాల్స్ తరచూ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నట్టు మా స్నేహితుడు కూడా చెప్పాడు. దయచేసి ఏదో ఓ యాక్షన్ తీసుకోండి” అని ఓ యూజర్.. ట్వీట్ చేశారు.

వాట్సాప్ యూజర్లు ఏం చేయాలి?

WhatsApp Scam: తెలియని ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే వాట్సాప్ యూజర్లు ఆన్సర్ చేయకూడదు. ఆ కాల్స్ రిజెక్ట్ చేస్తే బెస్ట్. ఇలాంటి నంబర్లను యూజర్లు బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేస్తే ఆ నంబర్ నుంచి మీకు మళ్లీ కాల్స్, మెసేజ్‍లు రావు. ఒకవేళ పొరపాటున వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేసినా మీకు సంబంధించిన ఏ సమాచారం చెప్పకండి. ఎట్టిపరిస్థితుల్లో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను వెల్లడించకండి.

WhatsApp Scam: సైబర్ నేరస్థులు ముఖ్యంగా మీ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఓటీపీ వివరాలను తెలుసునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. అనేక రకాల విషయాలను చెప్పి బురిడీ కొట్టించాలని చూస్తారు. కాల్స్ ద్వారా ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి వివరాలను యూజర్లు చెప్పనేకూడదు. ఎలాంటి సందర్భాల్లోనూ ఓటీపీని మాత్రం వెల్లడించకూడదు.

Whats_app_banner