Electric Scooters In India : భారత్‌లో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఈ లిస్టులో మీకు ఏది ఇష్టమో చూడండి!
Electric Scooters In India : భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. చాలా మంది వీటివైపు మెుగ్గుచూపుతున్నారు. కంపెనీలు కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లోకి కొత్త వాహనాలను తీసుకొస్తున్నాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటే వాటి గురించి తెలుసుకోండి.
టూ వీలర్ లేకుండా ప్రస్తుత రోజుల్లో కష్టం. పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చాలా మంది ఇష్టంగా చూస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కూడా కొత్త మోడల్స్ వస్తున్నాయి. అనేక కంపెనీలు మంచి మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. బైక్‌లతో పోలిస్తే, స్కూటర్లు స్త్రీలు, పురుషులు ఇద్దరికీ అనుకూలంగా ఉంటాయి. అందుబాటు ధరలో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చూద్దాం..
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 95,998 నుండి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 3201 స్పెషల్ ఎడిషన్ 2901, అర్బేన్, ప్రీమియం వేరియంట్‌లతో వస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 113 నుండి 136 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
ఓలా S1 X, Air, Pro వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 74,999 నుండి రూ. 1.29 లక్షల ఎక్స్-షోరూమ్. 2 KWh, 3 KWh, 4 KWh బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జ్‌తో 195 కి.మీ వరకు వెళ్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.94,999 నుండి రూ.185,373 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 2.2 kWh, 3.4 kWh, 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల మైలేజీ వరకు అందిస్తుంది. వేరియంట్‌పై ఆధారపడి ఫీచర్లను కలిగి ఉంది. TFT స్క్రీన్, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, వాయిస్ అసిస్ట్ అలెక్సా స్కిల్‌సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
BGauss RUV350 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,09,999 నుండి రూ. 1,34,999 ఎక్స్-షోరూమ్. ఫుల్ ఛార్జింగ్‌తో 90 నుంచి 120 కిలోమీటర్లు నడుస్తుంది. RUV350i EX, RUV350 EX, RUV350 మ్యాక్స్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. గ్రే, ఆరెంజ్, ఎల్లో కలర్స్‌లో దొరుకుతుంది.
హీరో విడా ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 వరకు ఉంది. ఇది వీ1 ప్లస్, వీ1 ప్రో వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 100 నుండి 110 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఇది పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.