Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు పడి 82,201 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 54 పాయింట్లు పడి 25,145 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 73 పాయింట్లు పెరిగి 51,473 వద్దకు చేరింది.
నిఫ్టీ డైలీ క్యాండిల్‌లో చిన్న నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్‌లోని హై ఇప్పుడు రెసిస్టెన్స్‌గా పనిచేసింది.
"సాంకేతికంగా, ఈ నమూనా సుమారు 25,250 - 25,300 స్థాయిల వద్ద రెసిస్టెన్స్‌ని అధిగమించడానికి మార్కెట్లో బలం లేకపోవడాన్ని సూచిస్తుంది. అందువల్ల, భవిష్యత్తులో మార్కెట్లో మరింత కన్సాలిడేషన్ ఆశించవచ్చు. నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగా కొనసాగుతోంది,'' అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 688.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2970.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.54శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.5 శాతం పెరిగింది.
మరోవైపు ఆసియా మార్కెట్లు ఫ్లాట్- మైల్డ్ నెగిటివ్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎక్సైడ్): రూ.495 వద్ద కొనండి. రూ.520 టార్గెట్.. రూ.485 వద్ద స్టాప్ లాస్.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ): రూ.181కే కొనండి. రూ.186 టార్గెట్.. రూ.177 వద్ద స్టాప్ లాస్.
కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్ (కాన్సాయ్): రూ.310 వద్ద కొనండి. రూ.330 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.298.
సంబంధిత కథనం