Stocks to buy today : రూ. 90 దగ్గర ఉన్న ఈ స్టాక్ కొంటే.. షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 728 పాయింట్లు పెరిగి 66,902 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 207 పాయింట్ల లాభంతో 20,096 వద్ద ముగిసింది. 685 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 44,566 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో దూసుకెళుతోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 71.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2360.81 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ సూచీలు.. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
టాటా టెక్నాలజీస్ ఐపీఓ లిస్టింగ్..
Tata Tech IPO listing date : దేశీయ స్టాక్ మార్కెట్లో.. నేడు టాటా టెక్నాలజీస్ ఐపీఓ లిస్ట్ కానుంది. ఈ ఐపీఓకు బంపర్ లిస్టింగ్ లభిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఓ కటాఫ్ ప్రైజ్ రూ. 500గా ఉండగా.. లిస్టింగ్ ఫిగర్ 4 డిజిట్లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఐపీఓ అలాట్ అయిన వారికి జాక్‌పాట్ తగిలినట్టే!
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.04శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.09శాతం, నాస్డాక్ 0.16శాతం మేర నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఐసీఐసీఐ బ్యాంక్:- బై రూ. 939.60, స్టాప్ లాస్ రూ. 915, టార్గెట్ రూ. 980
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:- బై రూ. 748.2, స్టాప్ లాస్ రూ. 688, టార్గెట్ రూ. 808
ఎస్బీఐ:- బై రూ. 568, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 568
సెయిల్:- బై రూ. 91, స్టాప్ లాస్ రూ. 87, టార్గెట్ రూ. 95
ఎఫ్ఎస్ఎల్:- బై రూ. 175- రూ. 176, స్టాప్ లాస్ రూ. 169, టార్గెట్ రూ. 185
సీసీఎల్ ప్రాడక్ట్స్:- బై రూ. 650- రూ. 652, స్టాప్ లాస్ రూ. 635, టార్గెట్ రూ. 675
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం