Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- పేటీఎం షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్స్ వివరాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లోగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 231 పాయింట్లు పెరిగి 82,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 84 పాయింట్లు పెరిగి 25,236 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 198 పాయింట్లు పెరిగి 51,351 వద్దకు చేరింది.
నిఫ్టీ షార్ట్‌టర్మ్ ట్రెండ్ సానుకూలంగానే ఉందని, అయితే మార్కెట్ కొత్త గరిష్టాలకు ఇప్పుడే చేరుకోలేకపోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు. 25,300 నుంచి 25,400 స్థాయిల మధ్య రెసిస్టెన్స్ ఉండటంతో నిఫ్టీ మరింత కన్సాలిడేషన్ లేదా స్వల్ప క్షీణతను ఆశించవచ్చని అన్నారు. ఈ రోజు నిఫ్టీకి సపోర్ట్ 25,100 వద్ద ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5318.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3198.07 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాటగా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Sales Data : ఆగస్టు నెలలో పడిపోయిన మారుతి సుజుకి, టాటా మోటార్స్ అమ్మకాలు.. షేర్ల ధరపై ఎఫెక్ట్!
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.55శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.01శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.13 శాతం పతనమైంది.
సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఆసియా మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సఫారీ ఇండస్ట్రీస్: రూ.2476.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.2615, స్టాప్ లాస్ రూ.2390.
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్: రూ.977.45 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1030, స్టాప్ లాస్ రూ.940
యాక్సిస్ బ్యాంక్: రూ.1175 వద్ద కొనండి, టార్గెట్ రూ.1215, స్టాప్ లాస్ రూ.1145
బలరాంపూర్ చిని: రూ.600 వద్ద కొనండి, టార్గెట్ రూ.628, స్టాప్ లాస్ రూ.580
బిర్లాసాఫ్ట్: రూ.670 వద్ద కొనండి, టార్గెట్ రూ.715, స్టాప్ లాస్ రూ.650
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ప్లాస్టిబ్లెండ్స్ ఇండియా: రూ.359.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.377, స్టాప్ లాస్ రూ.345
పేటీఎం: రూ.621.90, టార్గెట్ రూ.653, స్టాప్ లాస్ రూ.599
అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్: రూ.88.76 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.93.50, స్టాప్ లాస్ రూ.85.50
హ్యూబాచ్ కలరెంట్స్ ఇండియా: రూ.588 వద్ద కొనండి, టార్గెట్ రూ.622, స్టాప్ లాస్ రూ.568
ఏడీఎస్ఎల్: రూ.265 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.280, స్టాప్ లాస్ రూ.256
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం