Stocks to buy today : అమెరికాలో మాంద్యం భయాలు పూర్తిగా తొలగిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 397 పాయింట్లు పెరిగి 24,541 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 790 పాయింట్లు పెరిగి 50,517 వద్దకు చేరింది.
నిఫ్టీ 400-500 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేటెడ్ అయిన తర్వాత 24,500 పైకి వెళ్లింది. సమీపకాలంలో నిఫ్టీ 24,300 - 24,550 శ్రేణిలో కన్సాలిడేషన్ని కొనసాగించవచ్చు. 24,550 పైన నిర్ణయాత్మక కదలిక తర్వాతే సూచీలో డైరెక్షన్ ట్రెండ్ కనిపించొచ్చు," అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అన్నారు. నిఫ్టీ 24,300 దిగువకు పడిపోతే తప్ప బై ఆన్ డిప్స్ వ్యూహం మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 766.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,606.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 28976.91 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 34060.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. డౌ జోన్స్ 0.24శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.2శాతం వృద్ధిచెందింది. నాస్డాక్ 0.09శాతం మేర స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్: రూ.1364 వద్ద కొనండి, టార్గెట్ రూ.1420, స్టాప్ లాస్ రూ.1335
బయోకాన్: రూ.340.95, టార్గెట్ రూ.357, స్టాప్ లాస్ రూ.332
శోక్ లేలాండ్: రూ .255.95 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .268, స్టాప్ లాస్ రూ .249
గ్రావిటా ఇండియా: రూ.2216.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.2325, స్టాప్ లాస్ రూ.2140
అనంత్ రాజ్: రూ.586.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.615, స్టాప్ లాస్ రూ.565
జిందాల్ పాలీ ఫిల్మ్స్: రూ.889.50 వద్ద కొనండి, టార్గెట్ రూ.935, స్టాప్ లాస్ రూ.855
సుప్రజిత్ ఇంజినీరింగ్: రూ.620.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.650, స్టాప్ లాస్ రూ.599
కైటెక్స్ గార్మెంట్స్: రూ .323.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .340, స్టాప్ లాస్ రూ .312
సంబంధిత కథనం