Stocks to buy today : ఈ రూ. 123 స్టాక్‌తో షార్ట్ టర్మ్‌లో లాభాలు- వీటినీ ట్రాక్ చేయండి!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 592 పాయింట్లు పడి 81,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 164 పాయింట్లు వృద్ధి చెంది 25,128 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 645 పాయింట్లు వృద్ధి చెంది 51,817 వద్దకు చేరింది.
“నిఫ్టీ50 25,000- సెన్సెక్స్ 81,500 పైన ట్రేడ్ అవుతున్నంత వరకు మార్కెట్లు కాస్త సానుకూలంగానే ఉంటాయి. 25200- 25260 వరకు నిఫ్టీ, 82300- 82500 వరకు సెన్సెక్స్ వెళ్లొచ్చు. కానీ 25000 దిగువకు నిఫ్టీ కింద పడితే సెంటిమెంట్ మార్చొచ్చు,” అని కొటాక సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ ఈక్విటీ రీసెర్చ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3731.59 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22278.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 0.47శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.77శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.87శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
రిలయన్స్ క్యూ2 ఫలితాలు..
స్టాక్స్ టు బై..
టొరెంట్ పవర్ లిమిటెడ్- రూ.1940.25 వద్ద కొనుగోలు, స్టాప్‌లాస్ రూ.1872 , టార్గెట్ రూ.2076.
ఎన్ఎండీసీ- బై రూ. 237.09, స్టాప్ లాస్ రూ. 229, టార్గెట్ రూ. 254
ఆర్ఈసీ లిమిటెడ్- బై రూ. 540, స్టాప్ లాస్ రూ. 528, టార్గెట్ రూ. 555
అంబుజా సిమెంట్స్- బై రూ. 589, స్టాప్ లాస్ రూ. 575, టార్గెట్ రూ. 615
టైటాన్ కంపెనీ- బై రూ. 3500, స్టాప్ లాస్ రూ. 3400, టార్గెట్ రూ. 3650
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
డీఎంఆర్: రూ.203 వద్ద కొనండి, టార్గెట్ రూ.222, స్టాప్ లాస్ రూ.195;
సెక్మార్క్ కన్సల్టెన్సీ: రూ.123 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.131, స్టాప్ లాస్ రూ.118;
డెల్టా మాన్యుఫాక్చరింగ్: రూ.107.26 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.115, స్టాప్ లాస్ రూ.103;
63 మూన్స్ టెక్నాలజీస్: రూ.495 వద్ద కొనండి, టార్గెట్ రూ.535, స్టాప్ లాస్ రూ.478;
గణేష్ హౌసింగ్ కార్పొరేషన్: రూ.992 వద్ద కొనండి, టార్గెట్ రూ.1050, స్టాప్ లాస్ రూ.960.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం