IPO: ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించనున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్
హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ ద్వారా రూ. 600 కోట్ల నిధులు సమీకరించనుంది.
హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను క్యాపిటల్ మార్కెట్ రెగ్యులర్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి సమర్పించింది.
పబ్లిక్ ఇష్యూలో రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లతో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 250 కోట్లు, అలాగే రూ. 10 విలువ కలిగిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జారీ చేయడం ద్వారా రూ. 350 కోట్లను సమీకరించనున్నట్టు కంపెనీ సెబీకి నివేదించింది.
భారత్‌లో ఫార్మా, కెమికల్ రంగాలకు సంబంధించి ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ 100 శాతం బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిధులను సమీకరించనుంది.
మూలధన వ్యయం, ఇప్పటికే ఉన్న కొన్ని రుణాలను తిరిగి చెల్లించడం, అలాగే సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ ఆఫర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించనుంది.
సంస్థ ప్రమోటర్లుగా ఎస్ 2 ఇంజనీరింగ్, కందుల రామకృష్ణ, కందుల కృష్ణ వేణి, నాగేశ్వర్ రావు కందుల, కాట్రగడ్డ మోహనరావు, కాట్రగడ్డ శివప్రసాద్ ఉన్నారు.
ఈ ఆఫర్ ద్వారా కుదరవల్లి పున్నారావు తమ వద్ద ఉన్న కొంత భాగాన్ని విక్రయించనున్నారు. ప్రమోటర్ గ్రూపునకు చెందిన ఆరుగురు సభ్యులు, మరో ఇద్దరు వాటాదారులు కూడా షేర్లను విక్రయించనున్నారు.
బిఆర్ఎల్ఎంలతో (బుక్ రన్నింగ్ లీడర్ మేనేజర్స్) సంప్రదింపులు జరిపి, ఈక్విటీ షేర్లకు మార్కెట్ డిమాండ్ అంచనా వేయడం ద్వారా ఆఫర్ ధర, ఫ్లోర్ ప్రైస్, క్యాప్ ప్రైస్‌ను నిర్ణయించనున్నట్టు కంపెనీ తన పత్రాల్లో తెలిపింది. ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ లిస్ట్ అవుతాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 497.59 కోట్లుగా ఉన్న కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 543.67 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఈ ఇష్యూకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు.
టాపిక్