Tax deduction to EV Customers: ఎలక్ట్రిక్ వాహనం కొంటే పన్ను రాయితీ ఉంది. తెలుసా?-section 80eeb deduction tax benefit of buying an electric vehicle ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Section 80eeb Deduction: Tax Benefit Of Buying An Electric Vehicle

Tax deduction to EV Customers: ఎలక్ట్రిక్ వాహనం కొంటే పన్ను రాయితీ ఉంది. తెలుసా?

HT Telugu Desk HT Telugu
Dec 21, 2022 09:06 PM IST

Tax deduction to EV Customers: విద్యుత్ వాహనం కొనుగోలు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తోంది. విద్యుత్ వాహనం కొనుగోలు కోసం తీసుకున్న రుణంపై చెల్లిస్తున్న వడ్డీకి ఈ రాయితీ వర్తిస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Tax deduction to EV Customers: విద్యుత్ వాహనం కొనుగోలు చేసిన వారికి రూ. 1.5 లక్షల వరకు పన్ను రాయితీ లభిస్తుంది. అయితే, అందుకు వారు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Tax deduction to EV Customers: 2019 ఆర్థిక సంవత్సరం నుంచే..

ఈ రాయితీని కేంద్ర ఆర్థిక మంత్రి 2019 బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ (Section 80EEB) కింద ఈ రాయితీని పొందవచ్చు. 2019 ఏప్రిల్ 1 తరువాత ఎలక్ట్రిక్ వాహనాన్ని(Electric Vehecle) కొనుగోలు చేసిన వారికి ఈ రాయితీ ప్రయోజనం లభిస్తుంది. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు(Electric Vehecle) ఈ రాయితీ అవకాశం ఉంది. అయితే, ఈ Section 80EEB ప్రయోజనాన్ని పొందడానికి కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. అవి

Section 80EEB: ఈ సెక్షన్ ప్రకారమే..

  • కొనుగోలు చేసింది నిబంధనల ప్రకారం విద్యుత్ వాహనమై(Electric Vehicle) ఉండాలి.
  • ఆ విద్యుత్ వాహనాన్ని(Electric Vehecle) ఏదైనా బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి రుణం తీసుకుని కొనుగోలు చేసి ఉండాలి.
  • Section 80EEB కింద గరిష్టంగా రూ. 1,50,000 వరకు ఆదాయ పన్ను రాయితీని పొందవచ్చు.
  • రుణంగా తీసుకున్న మొత్తంపై చెల్లిస్తున్న వడ్డీకి ఈ రాయితీ వర్తిస్తుంది.
  • రుణంగా తీసుకున్న వడ్డీ వార్షికంగా రూ. 1,50,000 కన్నా తక్కువ ఉంటే ఆ వడ్డీకి మాత్రమే రాయితీ లభిస్తుంది.
  • రెండో ఎలక్ట్రిక్ వాహనానికి ఈ Section 80EEB ప్రయోజనం లభించదు. అంటే, ఇప్పటికే మీకు ఒక ఎలక్ట్రిక్ వాహనం(Electric Vehecle) ఉండి,రెండో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే, ఆ రెండో ఎలక్ట్రిక్ వాహనంపై మీరు ఈ రాయితీని పొందలేరు.
  • వ్యక్తిగత లేక బిజినెస్ అవసరాల కోసం విద్యుత్ వాహనాన్ని(Electric Vehecle) కొనుగోలు చేసినవారికి ఈ రాయితీ లభిస్తుంది.
  • పూర్తిగా రుణాన్ని చెల్లించేవరకు, అంటే రుణ కాల పరిమితి ముగిసే వరకు ఈ రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
  • 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య విద్యుత్ వాహనం కొనుగోలు చేసిన వారికి మాత్రమే section 80EEB కింద ఈ రాయితీ వెసులుబాటు ఉంటుంది.
  • ఈ ఆదాయ పన్ను వెసులుబాటు వ్యక్తులకు మాత్రమే. సంస్థలకు ఈ సదుపాయం లేదు.
  • విద్యుత్ వాహనం(Electric Vehecle) కొనుగోలు కోసం రుణాన్ని ఏదైనా బ్యాంక్ లేదా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్(financial institution) నుంచి కానీ, ఎన్ బీఎఫ్ సీ (non banking financial company) నుంచి కానీ తీసుకుని ఉండాలి.
  • 2019 ఏప్రిల్ నుంచి ఈ పన్ను రాయితీతోపాటు విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12% నుంచి 5 శాతానికి తగ్గించారు.

WhatsApp channel