Samsung: సామ్‍సంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. మీ మొబైల్‍కు ఆండ్రాయిడ్ 13 అప్‍డేట్ ఎప్పుడొస్తుందంటే..! ఫుల్ లిస్ట్-samsung smartphones android 13 based oneui 5 0 update roadmap check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Smartphones Android 13 Based Oneui 5.0 Update Roadmap Check Full Details

Samsung: సామ్‍సంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. మీ మొబైల్‍కు ఆండ్రాయిడ్ 13 అప్‍డేట్ ఎప్పుడొస్తుందంటే..! ఫుల్ లిస్ట్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 28, 2022 03:29 PM IST

Android 13 based OneUI 5.0 Update for Samsung Phones: ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‍యూఐ 5.0 అప్‍డేట్ సామ్‍సంగ్ స్మార్ట్‌ఫోన్‍లకు వచ్చేస్తోంది. రోల్అవుట్‍ను సామ్‍సంగ్ మొదలుపెట్టింది. అలాగే ఇండియాలో ఈ మోడల్‍కు ఎప్పుడు ఈ అప్‍డేట్ వస్తుందో వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు ఇవే.

Samsung: సామ్‍సంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. మీ మొబైల్‍కు ఆండ్రాయిడ్ 13 అప్‍డేట్ ఎప్పుడొస్తుందంటే..! ఫుల్ లిస్ట్
Samsung: సామ్‍సంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. మీ మొబైల్‍కు ఆండ్రాయిడ్ 13 అప్‍డేట్ ఎప్పుడొస్తుందంటే..! ఫుల్ లిస్ట్

Android 13 OneUI 5.0 Update for Samsung Phones: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‍తో కూడిన వన్‍యూఐ 5.0 అప్‍డేట్‍ రోల్అవుట్‍ను సామ్‍సంగ్ ప్రకటించింది. ఇండియాలో ఏ మోడల్‍కు ఎప్పుడు ఈ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5.0 అప్‍డేట్ ఇవ్వనున్నది రోడ్‍మ్యాప్‍ను వెల్లడించింది. ఈ అప్‍డేట్ ద్వారా చాలా కొత్త ఫీచర్లు యాడ్ కానున్నాయి. మరి ఏ సామ్‍సంగ్ మోడల్.. ఎప్పుడు ఆండ్రాయిడ్ 13 అప్‍డేట్ అందుకుంటుందో ఇక్కడ లిస్ట్ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్

Samsung Galaxy S Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22+ ఫోన్‍లకు ఈనెలలో ఇప్పటికే ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‍యూఐ 5.0 అప్‍డేట్ వచ్చింది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్21 5జీ, గెలాక్సీ ఎస్21 అల్ట్రా, గెలాక్సీ ఎస్20, గెలాక్సీ ఎస్20 5జీ, గెలాక్సీ 20 ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్20+, గెలాక్సీ ఎస్20 అల్ట్రా ఫోన్‍లు.. ఈ ఏడాది డిసెంబర్‍లో ఆండ్రాయిడ్ 13 అప్‍డేట్‍ను అందుకుంటాయి.

గెలాక్సీ నోట్ సిరీస్

Samsung Galaxy Note Series: సామ్‍సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ ఫోన్లు కూడా డిసెంబర్‍లోనే ఈ Android 13 Based OneUI 5.0 అప్‍డేట్‍ను పొందుతాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్‍లకు..

Samsung Galaxy A Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ32, గెలాక్సీ ఏ33, గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ52, గెలాక్సీ ఏ52ఎస్ 5జీ, గెలాక్సీ ఏ53 5జీ, గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ72, గెలాక్సీ ఏ73 5జీ మోడళ్లకు ఈ ఏడాది డిసెంబర్ లోనే ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5.0 అప్‍డేట్ వస్తుంది. గెలాక్సీ ఏ12, గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ22, గెలాక్సీ ఏ23 మొబైళ్లకు వచ్చే ఏడాది (2023) జనవరిలో గెలాక్సీ ఏ03, గెలాక్సీ ఏ23 5జీ, గెలాక్సీ ఏ03ఎస్, గెలాక్సీ ఏ04, గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్‍లకు ఫిబ్రవరిలో ఈ అప్‍డేట్ లభిస్తుంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ మొబైళ్లకు..

Samsung Galaxy M Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం32, గెలాక్సీ ఎం32 5జీ, గెలాక్సీ ఎం33 5జీ, గెలాక్సీ ఎం42, గెలాక్సీ ఎం52 5జీ ఫోన్‍లకు ఈ ఏడాది డిసెంబర్లోనే Android 13 Based OneUI 5.0 Update వస్తుంది. గెలాక్సీ ఎం12, గెలాక్సీ ఎం53 5జీకి 2023 జనవరిలో, గెలాక్సీ ఎం13, గెలాక్సీ ఎం13 5జీ ఫోన్‍లకు ఫిబ్రవరిలో అప్‍డేట్ అందుతుంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్

Samsung Galaxy F Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫోన్‍కు వచ్చే నెలలో, గెలాక్సీ ఎఫ్22, గెలాక్సీ ఎఫ్42 5జీ, గెలాక్సీ ఎఫ్12 మొబైళ్లకు 2023 జనవరిలో, గెలాక్సీ ఎఫ్13, గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్‍లకు ఫిబ్రవరిలోగా ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5.0 అప్‍డేట్ వస్తుంది.

సామ్‍సంగ్ గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‍లు..

Samsung Galaxy Z Series: సామ్‍సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్2, గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 5జీ, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 5జీ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్3 5జీ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 5జీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు Android 13 Based OneUI 5.0 అప్‍డేట్‍ను ఈ ఏడాది డిసెంబర్ లోనే అందుకుంటాయి.

WhatsApp channel

టాపిక్