బైక్స్ లో ఇప్పుడు యాంటీ లాక్ బ్రేకింగ్ లేదా ఏబీఎస్ సిస్టమ్ ఇప్పుడు అత్యంత సురక్షిత ఫీచర్. సేఫ్ రైడింగ్ కోసం ఈ సిస్టమ్ ను ఇప్పుడు అటు విమానాల్లో, ఇటు బస్, ట్రక్, కార్, బైక్ ల్లో కూడా అమరుస్తున్నారు. బైక్ ల్లో ఈ ఏబీఎస్ ఉన్న మోడల్స్ ఇవే..,TVS Apache RTR 200 4V: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ,అపాచీ.. టీవీఎస్ నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ మోడల్. అపాచీ 200 4వీ మోడల్ లో డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ను అమర్చారు. వీల్ లాక్ కాకుండా కాపాడే ఈ సిస్టమ్ వల్ల బైక్ స్టెబిలిటీ, రైడింగ్ క్వాలిటీ మరింత మెరుగవుతుంది. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.4 లక్షలుగా ఉంది. ఇందులో 197.7 సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యుయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ను అమర్చారు.,Bajaj Pulsar NS200: బజాబ్ పల్సర్ ఎన్ఎస్ 200,బజాజ్ పల్సర్ ను బజాజ్ బైక్స్ కు లైఫ్ ఇచ్చిన మోడల్ గా చెప్పవచ్చు. పల్సర్ రేంజ్ లో వచ్చిన ప్రతీ బైక్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ పల్సర్ ఎన్ఎస్ 200 (Bajaj Pulsar NS200) బైక్ కు డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ను అమర్చారు. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.47 లక్షలుగా ఉంది. ఇందులో 199.5 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది.,Yamaha FZ25: యమహా ఎఫ్ జీ 25,యమహాలోని ఈ Yamaha FZ25 మోడల్ లో కూడా డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ను అమర్చారు. అలాగే ఇందులో 282 ఎంఎం డిస్క్ బ్రేక్ ను ముందు వీల్ కు, 282ఎంఎం, 220 ఎంఎం డిస్క్ బ్రేక్ ను వెనుక వీల్ కు అమర్చారు. ఇది 249 సీసీ, ఎయిర్ కూల్డ్, ఫ్యుయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉన్న బైక్. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.5 లక్షలు.,Bajaj Pulsar N160: బజాజ్ పల్సర్ ఎన్ 160, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160,బజాజ్ పల్సర్ ఎన్ 160 ఎక్స్ షో రూమ్ ధర సుమారు రూ. 1.3 లక్షలు. వేరు వేరు రంగుల్లో లభించే ఈ బైక్ లో బ్రూక్లిన్ బ్లాక్ (Brooklyn Black) కలర్ మోడల్ లో మాత్రమే డ్యుయల్ చానెల్ ఏబీఎస్ సదుపాయం కల్పించారు. ఇందులో ఫ్రంట్ వీల్ కు 300 ఎంఎం డిస్క్ బ్రేక్, బ్యాక్ వీల్ కు 230 ఎంఎం డిస్క్ బ్రేక్ ను అమర్చారు. అలాగే, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 మోడల్ లో కూడా డ్యుయల్ చానెల్ ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.35 లక్షలు. ఇందులో 160సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు.