Redmi Writing Pad । కేవలం రూ. 599.. రైటింగ్ ప్యాడ్‌ను లాంచ్ చేసిన రెడ్‌మి!
Redmi Writing Pad: నోట్స్ రాసుకునే వారికి, స్కెచింగ్‌లను రూపొందించే వారికి సౌకర్యవంతంగా ఉండేలా Redmi కంపెనీ అతితక్కువ ధరలో రైటింగ్ ప్యాడ్‌ను లాంచ్ చేసింది. మరిన్ని వివరాలు చూదండి.
చైనీస్ టెక్నాలజీ కంపెనీ రెడ్‌మి తమ బ్రాండ్ నుంచి తాజాగా సరికొత్త డివైజ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Redmi Writing Pad ఇప్పుడు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇందులో ఎలక్ట్రోఫోరేటిక్ డిస్‌ప్లే అని పిలిచే ప్ర 8.5 అంగుళాల LCD స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ ప్రత్యేక రకమైన స్క్రీన్‌కు బ్యాక్‌లైటింగ్ అవసరం లేదు. కాబట్టి దీని స్క్రీన్ కాంతిని విడుదల చేయదు, నలుపు రంగులో ఉంటుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది టాబ్లెట్ ఫోన్ కాదు. కానీ అలా కనిపించే రైటింగ్ ప్యాడ్. ఈ రెడ్‌మి రైటింగ్ ప్యాడ్‌ను ఉపయోగించి నోట్స్ రాసుకోవచ్చు, డూడ్లింగ్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ పలక, దీనిపై బలపంలా ఉపయోగించగలిగే ఒక ప్రెజర్-సెన్సిటివ్ స్టైలస్‌ను కూడా అందిస్తున్నారు. దీనితో విభిన్న కలర్ షేడ్స్‌ని సృష్టించవచ్చు, వివిధ స్ట్రోక్ సైజులకు మారవచ్చు.
నేటి కాలంలో ప్రతీది స్క్రీన్‌పై నొక్కడం, కీప్యాడ్‌పై టైప్ చేయడం, కాపీ పేస్ట్‌లు చేయడమే ఉంటుంది. చేతితో రాసే అవసరమే లేకుండా పోయింది. అయితే రైటింగ్ ప్యాడ్‌ను విడుదల చేయటం ద్వారా రెడ్‌మి కంపెనీ మళ్లీ ఆ పాత స్కూల్ రోజులను గుర్తుకు చేస్తుంది. వాస్తవానికి టైప్ చేసే వారి కంటే చేతితో రాసే వారే ఎక్కువ స్మార్ట్ అని పలు అధ్యయనాలు రుజువు చేశాయి కూడా.
Redmi Writing Pad Price and Features
ఈ రైటింగ్ ప్యాడ్ ABS మెటీరియల్‌తో రూపొందించారు. దీని బరువు కేవలం 90 గ్రాములు మాత్రమే, ఇక స్టైలస్ బరువు 5 గ్రాములు ఉంటుంది. అందువల్ల దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లడం, వాడటం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చదువుకునే పిల్లలకు గణితం ప్రాక్టీస్ చేయటానికి, సైన్స్ డయాగ్రామ్స్ వేయటానికి లేదా నోట్స్ రాసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పేపర్, పెన్ అవసరం ఉండదు, కాగితం వేస్ట్ అనేది జరగదు.
మీరు డూడ్లింగ్ లేదా నోట్స్ రాసుకోవడం పూర్తి చేసిన తర్వాత కింద ఇచ్చిన నారింజ రంగు బటన్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా స్క్రీన్‌ను క్లియర్ చేయవచ్చు. స్క్రీన్ నుండి కంటెంట్ తొలగించకుండా నిరోధించడానికి పక్కన ఒక-ట్యాప్ లాక్ కూడా ఉంది.
Redmi రైటింగ్ ప్యాడ్ ధర రూ. 599/- . ప్రస్తుతం Mi స్టోర్‌లలో కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం