Presstonic IPO: ప్రెస్టోనిక్ ఐపీఓ; ప్రైస్ బ్యాండ్ రూ. 72; జీఎంపీ రూ. 23; అప్లై చేయొచ్చా?-presstonic ipo opens on monday price band set at 72 rupees should you apply ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Presstonic Ipo: ప్రెస్టోనిక్ ఐపీఓ; ప్రైస్ బ్యాండ్ రూ. 72; జీఎంపీ రూ. 23; అప్లై చేయొచ్చా?

Presstonic IPO: ప్రెస్టోనిక్ ఐపీఓ; ప్రైస్ బ్యాండ్ రూ. 72; జీఎంపీ రూ. 23; అప్లై చేయొచ్చా?

HT Telugu Desk HT Telugu
Dec 09, 2023 04:14 PM IST

Presstonic IPO: ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్ IPO సోమవారం, డిసెంబర్ 11న మార్కెట్లోకి వస్తోంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ కు డిసెంబర్ 13, బుధవారం వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (www.presstonic.com)

Presstonic IPO: ప్రధానంగా మెట్రో రైల్ (metro rail) రోలింగ్ స్టాక్ ను, మెట్రో రైల్ సిగ్నలింగ్ ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేసే ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్ సంస్థ ఐపీఓ ఈ సోమవారం మార్కెట్లోకి వస్తోంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కేటగిరీలో వస్తున్న ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ 72 గా నిర్ణయించారు.

లాట్ లో 1600 షేర్లు

ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్ ఐపీఓ కు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ 72 గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు లాట్స్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో రూ. 10 ముఖ విలువ కలిగిన 1600 ఈక్విటీ షేర్స్ ఉంటాయి. అంటే, ఒక ఇన్వెస్టర్ ఒక లాట్ కు అప్లై చేయాలంటే రూ. 1,15,200 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ప్రెస్టోనిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వివరాలు

ప్రెస్టోనిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మౌలిక సదుపాయాల ఉత్పత్తులు, మెట్రో రైల్ రోలింగ్ స్టాక్, మెట్రో రైల్ సిగ్నలింగ్ ప్రొడక్ట్ లను తయారు చేస్తుంది. ఇది రైల్, మెట్రో రైల్ రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ పరికరాలను తయారు చేసే, సేవలందించే ఓఈఎం (OEM) లను కూడా సరఫరా చేస్తుంది. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయంలో 66.11% వృద్ధి నమోదైంది. యెర్మల్ గిరిధర్ రావు, హెర్గ పూర్ణచంద్ర కెడిలయ ఈ కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు.

IPO details: ఐపీఓ వివరాలు..

ఈ ఐపీఓ తో రూ. 23.30 కోట్లను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. అందుకోసం 3,236,800 ఈక్విటీ షేర్లను సేల్ చేస్తోంది. యంత్రాల కొనుగోలు వంటి మూలధన వ్యయానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. అలాగే, రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించడం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడం వంటి లక్ష్యాలను కూడా పెట్టుకుంది. ఈ ఐపీఓలో షేర్ల కేటాయింపు డిసెంబర్ 14న జరుగుతుంది. అలాగే, ఈ ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్ IPO షేర్లు సోమవారం, డిసెంబర్ 18న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

Presstonic IPO GMP: గ్రే మార్కెట్ ప్రీమియం

ప్రెస్టోనిక్ ఇంజనీరింగ్ IPO షేర్లు శనివారం గ్రే మార్కెట్ లో రూ. 23 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే, లిస్టింగ్ రోజు ఈ ఐపీఓ షేర్లు ఇష్యూ ధర అయిన రూ. 72 కు అదనంగా రూ. 23 ప్రీమియంతో రూ. 95 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. 'గ్రే మార్కెట్ ప్రీమియం (GMP)' అనేది ఇష్యూ ధర కంటే ఎక్కువ చెల్లించడానికి పెట్టుబడిదారుల సంసిద్ధతను సూచిస్తుంది.

Whats_app_banner