Tech companies layoff : 2024 మొదటి కొన్ని రోజుల్లోనే 7,500కు పైగా మంది ఉద్యోగాలు ఉఫ్..!
Tech companies layoff in 2024 : ఈ ఏడాది మొదటి నెల, కొన్ని రోజుల్లోనే, 7,500 మందికిపైగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు! ఈ నేపథ్యంలో చాలా మంది టెక్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
Tech companies layoff in 2024 : 'ఎఫీషియెన్సీ' పేరుతో పెద్ద పెద్ద టెక్ సంస్థలు.. లేఆఫ్‌లపై మళ్లీ ఫోకస్ చేస్తున్నాయి! 2024 మొదటి నెల కొన్ని రోజుల్లోనే.. ప్రపంచవ్యాప్తంగా 7,500కిపైగా మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళనకరమైన వార్త. అంతేకాకుండా.. గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు.. ఏడాది పొడవునా ఉద్యోగాలను కట్ చేస్తూ ఉంటామని చెబుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తున్న విషయం.
2024లో పరిస్థితులు ఇంతేనా..?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెంచి, అనవసరమైన సెక్టార్స్‌లో ఉద్యోగాలను కట్ చేయాలని బడా సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 2024లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కానీ.. ఈ ఏడాది జరిగే లేఆఫ్‌లు.. టార్గెటెడ్‌గా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇప్పటికే వేలాది మందిని ఇళ్లకు పంపించేసింది. అతిపెద్ద ప్రాధాన్యతలపైనే ఖర్చు చేస్తామని చెబుతూ.. అనేక మందిని తొలగించేసింది గూగుల్. అడ్వర్టైజింగ్, పిక్సెల్, ఫిట్బిట్తో పాటు అనేక విభాగాల్లోని ఉద్యోగాల్లో కోతలు విధించింది.
2024 layoffs latest news : ఇక అమెజాన్ విషయానికొస్తే.. గత వారం చాలా మందినే ఇళ్లకు పంపించింది. స్ట్రీమింగ్, ఆడియో ఆపరేషన్స్‌పై అధిక ప్రభావం పడింది. ఇలా.. 2024 జనవరి మొదటి కొన్ని రోజుల్లోనే 7,500మందికిపైగా ఉద్యోగులు తమ జాబ్స్ని కోల్పోయారు!
ఇదీ చూడండి:- Tech layoffs 2024: ఐటీ ఉద్యోగులకు 2024 లో పీడ కలలేనా..?
"ప్రపంచవ్యాప్తంగా ఏఐ రివొల్యూషన్ కనిపిస్తోంది. ఏ కంపెనీ కూడా వెనకపడాలని కోరుకోదు. అందుకే.. ఏఐని ప్రాయారిటీగా చేసుకుంటున్నాయి. ఇది ఉద్యోగాలపై ప్రభావం చూపించవచ్చు," అని డీ.ఏ డేవిడ్సన్ అండ్ కో ఎనలిస్ట్ గిల్ లురియా తెలిపారు.
Google layoffs 2024 : అయితే.. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే, 2024లో జాబ్ కట్స్ నెంబర్లు తక్కువగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. 2023లో టెక్ సెక్టార్‌లోని 1,68,032 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అల్ఫాబెట్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్‌లో పరిస్థితులు సర్వత్రా చర్చకు దారితీశాయి.
ఇదిలా ఉండగా.. లేఆఫ్ వార్తలు విని టెక్ ఉద్యోగుల్లో భయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
సంబంధిత కథనం