Reliance recruitment: రిలయన్స్ లో ఎంట్రీ లెవెల్ ఇంజనీర్ జాబ్స్; డోంట్ మిస్..
Reliance recruitment: రిలయన్స్ లో ఎంట్రీ లెవెల్ ఇంజనీర్స్ రిక్రూట్ మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్స్ నుంచి ఈ రిక్రూట్మెంట్ కోసం రిలయన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Reliance recruitment: భారతదేశం యొక్క అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశం నలుమూలల నుండి ఎంట్రీ-లెవల్ యువ ఇంజనీర్‌లను రిక్రూట్ చేయడానికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.
భారీ రిక్రూట్మెంట్
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి తెలియజేస్తూ, వ్యాపార విభాగాల్లో కీలకమైన సాంకేతిక పాత్రలకు యువ ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. దేశంలోని కొన్ని మంచి ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్నఅందరు ఇంజనీరింగ్ విద్యార్థులకు సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించింది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు రిలయన్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. సాధారణంగా, పెద్ద కంపెనీలు భారతదేశంలోని అగ్రశ్రేణి కళాశాలల నుండి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను నియమించుకుంటాయి.
ఎవరు అర్హులు..?
ఏదైనా ఏఐసీటీఈ (AICTE) గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 2024 లో బీ టెక్ (B.Tech) లేదా బీఈ (B.E) పూర్తి చేసే విద్యార్థుల నుండి రిలయన్స్ ఈ రిక్రూట్ మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్‌లలో ఈ నియామకాలు ఉంటాయి. అలాగే, విద్యార్థులు వారి 10వ తరగతి, 12వ తరగతి డిప్లొమా (వర్తిస్తే) కోర్సుల్లో కనీసం 60% లేదా 6 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (CGPA) సాధించి ఉండాలి. అదనంగా, ఇంజనీరింగ్‌లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసి ఉండాలి.
ఎప్పటి నుంచి?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ లో ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 11 నుండి జనవరి 19 వరకు అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత అప్లికేషన్స్ ను పరిశీలించి, అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆన్ లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ మార్చి చివరి నాటికి పూర్తవుతుందని రిలయన్స్ తెలిపింది.
ఏయే విభాగాల్లో..?
ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రో కెమికల్స్ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు సాగిస్తున్న దాదాపు అన్ని విభాగాల్లో ఈ ఉద్యోగుల నియామకాలు ఉంటాయి.
టాపిక్