Moto G45 5G : ఇండియాలో మోటో జీ45 లాంచ్ డేట్ ఫిక్స్- ఈ ఫీచర్స్ చూస్తే కొనేస్తారు!
Moto G45 5G price in India : మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జీ45 5జీ ఇండియా లాంచ్ ఫిక్స్ అయ్యింది. లాంచ్‌కి ముందు ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై మోటోరోలా సంస్థ మరింత ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఆగస్ట్ 21న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ గ్యాడ్జెట్ పేరు మోటో జీ45. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో ప్రపంచ మార్కెట్లలో కూడా లాంచ్ అవుతుందని అంచనా ఉన్నాయి. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌తో సహా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో దీని లభ్యతను ధృవీకరిస్తూ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేసింది.
మోటోరోలా జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ కొత్త మోడల్ ఆగస్ట్ 21 మధ్యాహ్నం భారతదేశంలో లాంచ్ కానుంది. మోటో జీ45 5జీ స్మార్ట్‌ఫోన్ వెజిటేరియన్ లెథర్ డిజైన్‌లో రానుంది.
ఫిప్కార్ట్ వివరాల ప్రకారం ఈ మోటో జీ45 5జీలో స్నాప్‌డ్రాగన్ 6ఎస్‌జెన్ 3 ఎస్వోసీ చిప్సెట్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ స్టోరేజ్ సామర్థ్యం ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయెల్ కెమెరా సెటప్‌ని ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 6.5 ఇంచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో హై-రెస్ ఆడియో, డాల్బీ అట్మాస్, స్మార్ట్ కనెక్ట్‌తో పాటు 13 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది.
మోటో జీ45 స్పెసిఫికేషన్లు (అంచనా)..
మోటోరోలా నుంచి వస్తున్న మోటో జీ45 5జీ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అనేక లీక్స్, రెండర్లు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. టిప్స్టర్ఆర్సెన్ లుపిన్.. స్మార్ట్‌ఫోన్ ఎక్స్పెక్టెడ్ డిజైన్‌ను ప్రదర్శించడానికి మోటో జీ45 మార్కెటింగ్ మెటీరియల్ ఫొటోలను ఎక్స్‌లో @MysteryLupin పోస్ట్ చేశారు. లీకైన చిత్రాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, మెజెంటా, గ్రీన్ కలర్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. ప్రీమియం లుక్‌తో పాటు మంచి గ్రిప్‌ను ఇవ్వడానికి ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో వెజిటేరియన్ లెథర్ కవర్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని లీక్ సూచించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్స్‌లో ఫ్లాట్‌గా ఉండి నిగనిగలాడే ఫినిషింగ్‌ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఇది ప్లాస్టిక్‌తో వస్తుందని సమాచారం.
ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్న మోటో జీ4 ఇతర ప్రధాన స్పెసిఫికేషన్లపై కూడా లీకులు వెలుగు చూశాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది కొంతమేర వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉండొచ్చు. పూర్తిస్థాయిలో నీటిలో మునిగితే మాత్రం, గ్యాడ్జెట్ పనిచేయకపోవచ్చు!
ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌తో కలిపిన సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను కూడా కలిగిఉంటుందని రూమర్స్ సూచిస్తున్నాయి. ఇది 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది.
ఆగస్ట్ 21న లాంచ్ తర్వాత ఈ మోటో జీ45 5జీ ఇతర ఫీచర్లతో పాటు ధరకు సంబంధించిన వివరాలపై మరింత క్లారిటీ వస్తుంది. ఈ గ్యాడ్జెట్ ప్రైజింగ్ ముఖ్యంగా మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ స్మార్ట్‌ఫోన్‌ని మోటోరోలా ఏ ప్రైజ్పాయింట్లో తీసుకొస్తుందో చూడాలి.
సంబంధిత కథనం