Smartphone: రూ. 93 వేల విలువైన బ్రాండెడ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 52,900 లకే సొంతం చేసుకోండి..
దిగ్గజ ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అమేజాన్ సేల్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ ప్రియులకు లేదా కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. పాకెట్ ఫ్రెండ్లీ ధరల్లో వివిధ ఫీచర్ లోడెడ్ మొబైల్ ఫోన్లు, డివైజ్ లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు, డీల్స్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లలో ఒకటి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ లో 50 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరా ఉంది. దీంతో రాత్రిపూట అధిక-నాణ్యత చిత్రాలను తీయడానికి వీలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సులభమైన గేమింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ: ఎలా కొనాలి?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ స్మార్ట్ ఫోన్ అమెజాన్ వెబ్ సైట్ లో 45 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.52,900 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.95,999. మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి వినియోగదారులు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలుదారులు రూ.1000 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ:స్పెసిఫికేషన్స్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ లో అడ్వాన్స్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. గేమింగ్ కు కూడా ఈ స్మార్ట్ ఫోన్ సహకరిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.1-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 1750 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉన్నాయి. ఈ డిస్ ప్లే కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లభిస్తుంది.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
శాంసంగ్ (samsung) గెలాక్సీ ఎస్ 23 5జీ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, వెనుక భాగంలో ఓఐఎస్ తో మరో 10 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ (Smartphone) తో సెకనుకు 30 ఫ్రేమ్ ల చొప్పున 8కె వీడియోను క్యాప్చర్ చేయవచ్చు. 3,900 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే యూజర్లు రోజంతా హ్యాప్పీగా వాడుకోవచ్చు. గెలాక్సీ ఎస్ 23 5జీ (Samsung Galaxy S23 5G) క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.