Pixel 9 Pro Fold: గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్; ఏఐ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్
మేడ్ బై గూగుల్ 2024 ఈవెంట్ లో పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను గూగుల్ లాంచ్ చేసింది. ఈ పిక్సెల్ 9 సిరీస్ లో ఈ సారి గూగుల్ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా ఉండడం విశేషం. అధునాతన టెన్సర్ జీ4 చిప్సెట్, జెమినీ ఏఐ అప్ డేట్స్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ను గూగుల్ భారతదేశంలో విడుదల చేసింది.
గూగుల్ తన ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్’ ను భారతదేశంలో లాంచ్ చేసింది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కొత్త టెన్సర్ జీ 4 చిప్ సెట్ పై నడుస్తుంది. గూగుల్ కృత్రిమ మేథ టూల్ ‘జెమినీ ఏఐ’ నుంచి అనేక అప్ గ్రేడ్స్ ఇందులో ఉన్నాయి.
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ సింగిల్
ఒకే పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మోడల్ ను గూగుల్ విడుదల చేసింది. అది 16 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర రూ.1,72,999 గా ఉంది. గూగుల్ ప్రీమియం ఒబ్సిడియన్, పోర్స్లియన్ కలర్స్ లో ఇది లభిస్తుంది. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఈ గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్స్ లో లభిస్తుంది. వినియోగదారులు కొత్త పిక్సెల్ డివైజెస్ ను చెక్ చేయడానికి వీలుగా గూగుల్ (Google) భారతదేశంలో మూడు వాక్-ఇన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తోంది.
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Google Pixel 9 Pro Fold) 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లేతో వస్తుంది. ప్రధాన డిస్ప్లే 8 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ ప్యానెల్. ఇది 2152×2075 పిక్సెల్స్ రిజల్యూషన్, 2,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ టెన్సర్ జీ 4 చిప్సెట్, టైటాన్ ఎం 2 సెక్యూరిటీ చిప్ తో పనిచేస్తుంది. ఇందులో 4,650 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అయితే, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ను కొనుగోలు చేస్తే, బాక్స్ తో పాటు అడాప్టర్ రాదు. దానిని వేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కెమెరా సెటప్
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Google Pixel 9 Pro Fold) లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 10.5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 20ఎక్స్ సూపర్ రెస్ జూమ్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10 మెగాపిక్సెల్ కవర్ కెమెరా, 10 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే కెమెరా సపోర్ట్ ఉంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. అలాగే, 7 సంవత్సరాల ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్ లను గూగుల్ అందిస్తుంది.