Windows crashed : 'విండోస్' క్రాష్​- ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు!-microsofts windows crashed all over the world in a massive outage ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Windows Crashed : 'విండోస్' క్రాష్​- ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు!

Windows crashed : 'విండోస్' క్రాష్​- ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు!

Sharath Chitturi HT Telugu
Jul 19, 2024 12:12 PM IST

Windows crashed : మైక్రోసాఫ్ట్​ విండోస్​ క్రాష్​ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్​ సేవలకు అంతరాయం ఏర్పడింది.

మీ ల్యాప్​టాప్​/ పీసీ పనిచేయడం లేదా? కంగారు పడకండి..
మీ ల్యాప్​టాప్​/ పీసీ పనిచేయడం లేదా? కంగారు పడకండి..

మీ పర్సనల్​ ల్యాప్​టాప్​, ఆఫీస్​ ల్యాప్​టాప్/ పీసీ పనిచేయడం లేదా? విండోస్​ మాటిమాటికి షట్​డౌన్​, రీస్టార్ట్​ అవుతోందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్​ విండోస్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11:15 ప్రాంతంలో విండోస్​ పీసీలు సడెన్​గా ఆఫ్​ అయిపోయాయి. బ్లూ స్క్రీన్​లు కనిపించాయి. అంతేకాదు.. ఈ రీస్టార్ట్​ అనేది ఒక లూప్​లో జరగడం మొదలైంది. ఫలితంగా వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు.

“మీ సిస్టెమ్​కి సమస్య వచ్చింది. రీస్టార్ట్​ చేయాలి. ఎర్రర్​ ఇన్ఫోని సేకరిస్తున్నాము. మీ సిస్టెమ్​ని రీస్టార్ట్​ చేస్తాము,” అని విండోస్​ బ్లూ స్క్రీన్​ మీద టెక్ట్స్​ కనిపించింది. ఇది బ్లూ స్క్రీన్​ ఆఫ్​ డెట్​ ఎర్రర్​ (బీఎస్​ఓడీ).

అయితే csagent.sys అనే సిస్టెమ్​ ఫెయిల్​ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా విండోస్​ పీసీలు షట్​డౌన్​ అయినట్టు తెలుస్తోంది. CrowdStrike అప్డేట్​ కారణంగా మిండోస్​ పనిచేయడం లేదని మైక్రోసాఫ్ట్​ ప్రకటించింది. 

అయితే ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోందని స్పష్టమైంది. విండోస్​ పనిచేయడం లేదని ఇప్పటికే సోషల్​ మీడియాలో పోస్ట్​లు వెల్లువెత్తుతున్నాయి. జపాన్​ నుంచి అమెరికా వరకు అనేక ప్రాంతాల్లో, చాలా మంది ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు.

ఇలా చేస్తే సెట్​ అవుతుంది..!

హర్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​ కారణాల వల్ల ఈ సమస్య ఎదురవ్వొచ్చని టెక్​ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే కొత్త హార్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​ అప్డేట్​ వేసి, బ్లూ స్క్రీన్​ ఎర్రర్​ కనిపిస్తుంటే, పీసీని షట్​ డౌన్​ చేసేందుకు ప్రయత్నించండి. కొత్త హార్డ్​వేర్​ని తొలగించి, పీసీని రీస్టార్ట్​ చేయండి. రీస్టార్ట్​ అవ్వకపోతుంట, పీసీని సేఫ్​ మోడ్​తో స్టార్ట్ చేయండి.​

అప్పటికీ సిస్టెమ్​తో సమస్యలు వస్తుంటే.. బ్లూ స్క్రీన్​ ఎర్రర్​ని తొలగించేందుకు Get help app లోకి వెళ్లండి. Troubleshoot BSOD error ని సెర్చ్​ చేయండి. స్టెప్​-బై-స్టెప్​ ప్రాసెస్​ని ఫాలో అవ్వండి.

ఇప్పుడు ఏ రంగంలోనైనా కంప్యూటర్లు లేనిదే ఏ పనీ జరగదు! పైగా.. ప్రపంచంలో ఉన్న అన్ని సిస్టెమ్స్​లో దాదాపు ఉండే సాఫ్ట్​వేర్​ ఈ విండోస్​. ఇక శుక్రవారం అనేది వీక్​-డే కావడంతో చాలా మంది వర్క్​ చేసుకుంటున్న సమయంలో విండోస్​ క్రాష్​ అయ్యింది. ఫలితంగా వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలు ఏం జరుగుతోంది? అని తెలియడానేకే చాలా సమయం పట్టడంతో యూజర్స్​లో ఆందోళన మరింత పెరిగింది.

వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలు క్రాష్​ అవ్వడం సాధారణ విషయమే. కానీ ఏకంగా విండోస్​ పనిచేయకపోవడం చాలా చాలా అరుదైన విషయం!

విండోస్​ క్రాష్​పై సోషల్​ మీడియా ద్వారా ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మీమ్స్​ కూడా వైరల్​ అవుతున్నాయి.

“విండోస్​ ఔటేజ్​తో ఆఫీస్​ వేళ కాస్త విశ్రాంతి దొరికినందుకు విండోస్​ వినియోగదారులు సంతోషంగా ఉన్నారు” అని ఎక్స్​లో ఓ నెటిజన్​ పోస్ట్​ చేశారు. “శుక్రవారం విండోస్​ని క్రాష్​ చేయాలని మైక్రోసాఫ్ట్​ గట్టి ప్లాన్​ వేసింది,” అని ఇంకొకరు పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం