Maruti Suzuki SUV cars : మారుతీ సుజుకీ నుంచి మరిన్ని ఎస్​యూవీ మోడల్స్​..!-maruti suzuki to launch more suvs to invest 7000 crores ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki To Launch More Suvs, To Invest 7000 Crores

Maruti Suzuki SUV cars : మారుతీ సుజుకీ నుంచి మరిన్ని ఎస్​యూవీ మోడల్స్​..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 04, 2022 07:27 PM IST

Maruti Suzuki SUV cars : మారుతీ సుజుకీ.. ఎస్​యూవీ సెగ్మెంట్​పై మరింత దృష్టిపెట్టింది. రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్​ నుంచి మరిన్ని కొత్త మోడల్స్​ను కస్టమర్లు చూడవచ్చు.

మారుతీ సుజుకీ నుంచి మరిన్ని ఎస్​యూవీ మోడల్స్​..!
మారుతీ సుజుకీ నుంచి మరిన్ని ఎస్​యూవీ మోడల్స్​..! (PTI)

Maruti Suzuki SUV cars : మారుతీ సుజుకీ జోరు మీద ఉంది! కొత్త కొత్త మోడల్స్​ లాంచ్​తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కీలక ప్రకటన చేసింది ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ. ఎస్​యూవీ సెగ్మెంట్​పై మరింత దృష్టిపెట్టినట్టు తెలిపింది. మరిన్ని ఎస్​యూవీ మోడల్స్​ను లాంచ్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. ఇందుకోసం రూ. 7000కోట్లను కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

కొత్త ఎస్​యూవీలు..

న్యూ జనరేషన్​ బ్రెజా ఎస్​యూవీని ఈ ఏడాదిలో లాంచ్​ చేసింది మారుతీ సుజుకీ. ఆ తర్వాత గ్రాండ్​ విటారాను కూడా భారత రోడ్ల మీదకు తీసుకొచ్చింది. వీటిని చూస్తేనే.. ఎస్​యూవీ సెగ్మెంట్​పై మారుతీ సుజుకీ ఫోకస్​ పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరో అదిరిపోయే వార్త బయటకొచ్చింది. త్రీ-రో ఎస్​యూవీని విడుదల చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఫీచర్స్​, ధరకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Maruti Suzuki Grand Vitara : రూ. 7వేల కోట్ల పెట్టుబడితో హరియాణా సోనీపట్​లో ఓ కొత్త ఫ్యాక్టరీని మారుతీ సుజుకీ రూపొందిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈ సంస్థకు ఇప్పటికే మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక కొత్త ఫ్యాక్టరీని మూడేళ్లల్లో సిద్ధం చేసి, వార్షికంగా 2.5లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

"ఎస్​యూవీ పోర్ట్​ఫోలియోను శక్తివంతం చేసుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే మరిన్ని ఎస్​యూవీ మోడల్స్​ను లాంచ్​ చేస్తాము," అని మారుతీ సుజుకీ సీఎఫ్​ఓ అజయ్​ సేత్​ తెలిపారు. బ్రెజా, గ్రాండ్​ విటారా మోడల్స్​ సక్సెస్​ అయినట్టు పేర్కొన్నారు.

సూపర్​ ప్రొడక్షన్​..

Maruti Suzuki Latest cars : సప్లై చెయిన్​లో ఇబ్బందులు కారణంగా.. ఈ ఏడాది మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గింది. దాదాపు 35వేల వాహనాలను తయారు చేయలేకపోయింది. మొత్తం మీద.. సెప్టెంబర్​ త్రైమాసికం ముగిసేనాటికి.. మారుతీ సుజుకీకి 4.12లక్షల కార్లను డెలివరీ చేయాల్సి ఉంది. వీటిల్లో.. బ్రెజా, గ్రాండ్​ విటారాలే ఏకంగా 1.3లక్షలుగా ఉన్నాయి.

అయితే.. మారుతీ సుజుకీ ఇప్పటి వరకు ఎన్ని వాహనాలను ఉత్పత్తి చేసిందన్న వివరాలు తాజాగా బయటికి వచ్చాయి. భారత్‍లో అత్యధిక ప్యాసింజర్ కార్లను ఉత్పత్తి చేసిన సంస్థగా సుజుకీ నిలిచింది. 1983లో సంస్థను ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు 2.5కోట్లకుపైగా యూనిట్లను తయారు చేసింది సుజుకీ. ప్యాసింజర్​ సెగ్మెంట్​లో ఈ మైలురాయిని మరో ఇతర ఆటో సంస్థ కూడా చేరలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం