Maruti Suzuki Cars Production : ఇప్పటి వరకు ఎన్ని మారుతీ కార్లు ఉత్పత్తి అయ్యాయంటే..! ఆశ్చర్యపరిచేలా నంబర్స్
Maruti Suzuki Cars Production: ప్రముఖ కంపెనీ మారుతీ సుజుకీ ఇప్పటి వరకు ఎన్ని వాహనాలను ఉత్పత్తి చేసిందన్న వివరాలు బయటికి వచ్చాయి. భారత్‍లో అత్యధిక ప్యాసింజర్ కార్లను ఉత్పత్తి చేసిన సంస్థగా సుజుకీ ఉంది.
Maruti Suzuki Cars Production : భారత కార్ మార్కెట్‍లో మారుతీ సుజుకీ అధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో టాప్‍లో దూసుకెళుతోంది. 1983లో దేశంలో కార్ల ఉత్పత్తిని మారుతీ ప్రారంభించింది. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు ఎన్ని కార్లను ఉత్పత్తి చేసిన విషయాన్ని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా యూనిట్లను తయారు చేసినట్టు సుజుకీ పేర్కొంది. ప్యాసింజర్స్ వెహికల్ ప్రొడక్షన్‍లో ఈ మైలురాయిని దాటిన ఏకైక భారతీయ కంపెనీగా మారుతీ సుజుకీ నిలిచింది.
హర్యానాలోని గురుగ్రామ్‌లో 1980 దశకం ప్రారంభంలో వాహనాల ఉత్పత్తి పనులను మారుతీ ప్రారంభించింది. మారుతీ మొదటి మోడల్ ఎం800. భారత వాహనాల మార్కెట్‍లో ఈ మారుతీ 800 కార్ చాలా సంవత్సరాల పాటు ఆధిపత్యం చెలాయించింది. సేల్స్ విషయంలో దూసుకెళ్లింది. ఆ తర్వాత మారుతీ సుజుకీ చాలా వాహనాలను లాంచ్ చేసింది. పోర్ట్ ఫోలియోను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ నుంచి దాదాపు 16 మోడల్స్ మార్కెట్‍లో అందుబాటులో ఉన్నాయి.
Maruti Suzuki Cars Production : ప్రస్తుతం రెండు మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో వాహనాలను మారుతీ సుజుకీ ఉత్పత్తి చేస్తోంది. ఒకటి గురుగ్రామ్‌లో ఉండగా.. మరో యూనిట్ మనేసర్‍లో ఉంది. ప్రస్తుతం సంవత్సరానికి 15లక్షల యూనిట్లను మారుతీ ఈ యూనిట్లలో తయారు చేస్తోంది.
"భారత ప్రజలతో సుజుకీ భాగస్వామం 2022తో 40 సంవత్సరాలకు చేరింది. 25 మిలియన్ల ఉత్పత్తి మైలురాయిని ఈ సంవత్సరం దాటడం సుజుకీ నిబద్ధతకు తార్కాణం. భారత ప్రజలతో భాగస్వామ్యానికి నిదర్శనం. కోట్లాది మంది ప్రజల సొంత కార్ కలను మారుతీ సుజుకీ సాకారం చేయగలుగుతోంది’ అని మారుతీ సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాహి టకేయూచీ పేర్కొన్నారు.
భారతీయ కార్ మార్కెట్‍లో మారుతీ సుజుకీ ఇప్పటికే టాప్‍లో ఉంది. అయితే పోటీగా ఉన్న కొన్ని సంస్థలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. హ్యూందాయ్, టాటా మోటర్స్ ప్రస్తుతం వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మహీంద్రా, టొయోటా, కియా కంపెనీలు కూడా సేల్స్ ను క్రమంగా పెంచుకుంటున్నాయి. ఈ సంవత్సరంలో ఎక్స్ఎల్6, ఎర్టిగా, బలెనో, ఆల్టో, బ్రెజా మోడళ్ల కొత్త లుక్, అప్‍గ్రేడెడ్ వెర్షన్‍లను మారుతీ సుజుకీ మార్కెట్‍లోకి తీసుకొచ్చింది. ఇటీవల సుజుకీ లాంచ్ చేసిన గ్రాండ్ విటారా మిడ్-సైజ్ ఎస్‍యూవీ అమ్మకాల్లో దూసుకెళుతోంది.