Maruti Suzuki Alto Tour H1: లీటరుకు 34 కిమీల మైలేజీ, లేటెస్ట్ ఫీచర్స్.. ఆల్ న్యూ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1..-maruti suzuki alto tour h1 launched price starts at 4 80 lakh rupees only ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Maruti Suzuki Alto Tour H1 Launched, Price Starts At 4.80 Lakh Rupees Only

Maruti Suzuki Alto Tour H1: లీటరుకు 34 కిమీల మైలేజీ, లేటెస్ట్ ఫీచర్స్.. ఆల్ న్యూ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1..

HT Telugu Desk HT Telugu
Jun 09, 2023 04:51 PM IST

Maruti Suzuki Alto Tour H1: సరికొత్త ఆల్టోను మారుతి సుజుకీ ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెట్రోల్, సీఎన్జీ వర్షన్లలో వినియోగదారులను ఆకర్షించే మైలేజీతో ఈ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 (Maruti Suzuki Alto Tour H1) మార్కెట్లోకి వచ్చింది.

మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1
మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1

Maruti Suzuki Alto Tour H1: ఎంట్రీ లెవెల్ కార్లలో మరో కారును మారుతి సుజుకీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కమర్షియల్ సెగ్మెంట్ కార్ అయిన మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 (Maruti Suzuki Alto Tour H1) బీఎస్ 6 (BS6) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందింది. ఇందులో ఏబీఎస్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫెసిలిటీలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Maruti Suzuki Alto Tour H1 price: ధర 4.8 లక్షలు మాత్రమే

ఈ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 (Maruti Suzuki Alto Tour H1) ఎక్స్ షో రూమ్ ధర రూ. 4,80,500 లతో ప్రారంభమవుతుంది. ఇది 1 లీటర్ ఇంజిన్, 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మోడల్ ధర. ఇందులో సీఎన్జీ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 5,70,500. ఈ కారు మొత్తం 3 రంగుల్లో లభిస్తుంది. అవి మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, ఆర్క్టిక్ వైట్. మారుతి సుజుకీలో టూర్ ఎడిషన్స్ సెడాన్, హ్యాచ్ బ్యాక్, ఎంయూవీ సెగ్మెంట్లలో ఉన్నాయి.

Maruti Suzuki Alto Tour H1 mileage: 34 కిమీల మైలేజీ

ఈ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 కారులో కే సిరీస్ 1.0 లీటర్, డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ ఇంజిన్ ను అమర్చారు. ఇది మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు, మంచి మైలేజీని ఇస్తుంది. ఈ కారు పెట్రోలు వర్షన్ లీటరు కు 24.60 కిమీల మైలేజీ ఇస్తుంది. అలాగే, ఎస్ సీఎన్జీ వర్షన్ లీటరుకు 34.46 కిమీల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు 5500 ఆర్పీఎం వద్ద 66.6పీఎస్ పవర్ ను ప్రొడ్యూస్ చేయగలదు.

WhatsApp channel