SUVs to launch in June: మారుతి జిమ్ని, హోండా ఎలివేట్.. ఈ జూన్ నెలలో లాంచ్ కాబోతున్న ఎస్ యూ వీ లు..
SUVs to launch in June: చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పలు ఎస్ యూ వీ (SUV) లు ఈ జూన్ నెలలో లాంచ్ కాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మారుతి నుంచి వస్తున్న జిమ్ని (Jimny), హోండా మోటార్స్ ఎలివేట్. ఇవి జూన్ తొలివారంలో మార్కెట్లోకి రాబోతున్నాయి.
SUVs to launch in June: కొత్తగా ఎస్ యూ వీని కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు మరో రెండు వారాలు ఎదురు చూడడం మంచిది. తద్వారా వారు జూన్ నెలలో లాంచ్ కాబోతున్న ఎస్ యూవీలను కూడా పరిశీలించి, ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. జూన్ నెలలో మారుతి జిమ్ని (Jimny), హోండా ఎలివేట్ (Elevate), హ్యుండై ఎక్స్టర్ (Exter) వంటి ఎస్యూవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ మూడు వాహనాల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా, లగ్జరీ కార్ల విభాగంలో మెర్సెడెజ్ బెంజ్ నుంచి కూడా రెండు కొత్త మోడల్స్ వస్తున్నాయి.
Maruti Suzuki Jimny SUV: మారుతి జిమ్ని..
మారుతి సుజుకీ నుంచి వస్తున్న మరో ఎస్ యూ వీ జిమ్నీ (Maruti Suzuki Jimny) పై కంపెనీ కి చాలా ఆశలున్నాయి. జూన్ తొలివారంలో లాంచ్ కాబోతున్న ఈ కారుకు ఇప్పటికే దాదాపు 30వేల బుకింగ్స్ పూర్తి అయ్యాయి. ధర కూడా ప్రకటించక ముందే ఈ కారుకు ఇంత భారీ స్పందన లభించడం విశేషం. ఈ కారు మహింద్ర థార్ కు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. మారుతి సుజుకీ నుంచి ఇప్పటివరకు బ్రెజా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్ వంటి ఎస్ యూవీలు వచ్చాయి. మారుతి జిమ్నీ (Maruti Suzuki Jimny) లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 5 స్పీడ్ మాన్యువల్ లేదా స్పీడ్ ఆటో గేర్ బాక్స్ ను పొందుపర్చారు.మారుతి సుజుకీ లేటెస్ట్ ఆల్ గ్రిప్ ప్రొ 4X4 టెక్నాలజీని వాడారు.
Honda Elevate SUV: హోండా ఎలివేట్
ఫేమస్ కార్ మేకర్ హోండా నుంచి వస్తున్న మరో కాంపాక్ట్ ఎస్ యూ వీ ఎలివేట్ (Honda Elevate) . హ్యండై క్రెటా, మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, కియాసెల్టోస్ లకు పోటీగా దీనిని తీసుకువస్తున్నారు. ఈ ఎలివేట్ (Honda Elevate) ను జూన్ 6వ తేదీన అధికారికంగా లాంచ్ చేస్తున్నారు. ఈ ఎలివేట్ (Honda Elevate) లో చిన్న సన్ రూఫ్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బాడీ కలర్డ్ ఓఆర్వీఎం లు ఉన్నాయి. ఇందులో హోండా సిటీలో అమర్చిన 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోలు ఇంజిన్ నే అమర్చారు.
Hyundai Exter SUV: హ్యుండై ఎక్స్ టర్
స్మాల్ ఎస్ యూ వీ సెగ్మెంట్లోకి ఈ ఎక్స్టర్ (Hyundai Exter) తో హ్యుండై ప్రవేశిస్తోంది. టాటా పంచ్ ఎస్ యూ వీ కి పోటీగా ఈ ఎక్స్ టర్ (Hyundai Exter) ను తీసుకువస్తున్నారు. ఈ కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఎస్ యూవీని ఆథరైజ్డ్ షో రూమ్ ల్లో రూ. 11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ టర్ (Hyundai Exter) లో ఎక్స్ (EX), ఎస్ (S), ఎస్ ఎక్స్ (SX), ఎస్ ఎక్స్ ఓ (SX(O)), ఎస్ ఎక్స్ ఓ కనెక్ట్ (SX(O) Connect) వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇవి కాకుండా మెర్సెడెజ్ బెంజ్ నుంచి ఎలక్ట్రిక్ కారు విభాగంలో EQS SUV , AMG SL కూడా లాంచ్ అవుతున్నాయి.