Maruti Suzuki Jimny: 30వేలు దాటిన మారుతీ సుజుకీ జిమ్నీ బుకింగ్స్.. లాంచ్ ఎప్పుడంటే!-maruti suzuki jimny crosses over 30k bookings may launch in june first week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Jimny: 30వేలు దాటిన మారుతీ సుజుకీ జిమ్నీ బుకింగ్స్.. లాంచ్ ఎప్పుడంటే!

Maruti Suzuki Jimny: 30వేలు దాటిన మారుతీ సుజుకీ జిమ్నీ బుకింగ్స్.. లాంచ్ ఎప్పుడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 22, 2023 07:04 PM IST

Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ జిమ్నీ బుకింగ్స్ 30వేలు దాటేశాయి. జూన్ మొదటివారంలో ఈ ఆఫ్‍రోడ్ ఎస్‍యూవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Maruti Suzuki Jimny: 30వేలు దాటిన మారుతీ సుజుకీ జుమ్నీ బుకింగ్స్.. లాంచ్ ఎప్పుడంటే!
Maruti Suzuki Jimny: 30వేలు దాటిన మారుతీ సుజుకీ జుమ్నీ బుకింగ్స్.. లాంచ్ ఎప్పుడంటే!

Maruti Suzuki Jimny: లాంచ్‍కు ముందే మారుతీ సుజుకీ జిమ్నీ ఎస్‍యూవీ అదరగొడుతోంది. తాజాగా, ఈ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ కోసం ముందస్తు బుకింగ్స్ 30వేల మార్కును అధిగమించాయి. జూన్ మొదటి వారంలో మారుతీ సుజుకీ జిమ్నీ భారత మార్కెట్‍లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ అధికారిక ధర, పూర్తి వివరాలను అప్పుడు మారుతీ సుజుకీ వెల్లడించే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ధర వెల్లడి కాకముందే బుకింగ్‍ల్లో జిమ్నీ దుమ్మురేపుతోంది. రూ.25వేల టోకెన్ అమౌంట్ చెల్లించి జిమ్నీని బుక్ చేసుకోవచ్చు. కాగా, మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ గురించి చాలా వివరాలు ఇప్పటికే బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇవే..

మారుతీ సుజుకీ జిమ్నీ ఇంజిన్

Maruti Suzuki Jimny: 1.5 లీటర్ నేచురలీ ఆస్పిరేటెడ్ K15B పెట్రోల్ ఇంజిన్‍తో మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ రానుంది. 6000 rpm వద్ద 103 bhp పీక్ పవర్, 4000 rpm వద్ద 134Nm గరిష్ట టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేయగలదు. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్(MT), ఫోర్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ యూనిట్ (AT).. టాన్స్‌మిషన్స్ ఆప్షన్లుగా ఉంటాయి. ఆల్‍గ్రిప్ ప్రో 4x4 టెక్నాలజీ ఉండడంతో ఈ ఎస్‍యూవీ ఆఫ్‍రోడ్‍కు చాలా అత్యుత్తమంగా ఉంటుంది.

Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఫ్యుయల్ ఎఫిషియెన్సీ తాజాగా విడుదలైంది. జిమ్నీ ఎంటీ లీటర్ పెట్రోల్‍కు 16.94 కిలోమీటర్ల (16.94 kmpl) వరకు ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ ఇస్తుందని తెలుస్తోంది. జిమ్నీ ఏటీ 16.39kmpl వరకు ఫ్యుయల్ ఎఫిషియెన్సీ ఇస్తుందని సమాచారం. అయితే, వాడుకను బట్టి కాస్త తేడాలు ఉండే అవకాశం ఉంది. 40 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్‍ను ఈ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ కలిగి ఉంటుంది.

మారుతీ సుజుకీ జిమ్నీ కొలతలు

Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ 3,985 మిల్లీమీటర్ల (mm) లెన్త్ ఉంటుంది. 1,720 mm ఎత్తు, 1,645 mm వెడల్పు ఉంటుంది. వీల్ బేస్ 2,590 mmగా ఉంటుంది. 208 లీటర్ల బూట్ స్టోరేజ్‍తో వస్తుంది. 15 ఇంచుల స్టీల్, అలాయ్ వీల్స్ ఆప్షన్లు ఉంటాయి.

Maruti Suzuki Jimny: జెటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ అందుబాటులోకి రానుంది. జెటా వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఆల్ఫా కూడా రెండు ఆప్షన్‍లలో రానుంది. మొత్తంగా ఏడు విభిన్న కలర్లలో మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ రానుంది.

మారుతీ సుజుకీ జిమ్నీ అంచనా ధర

Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ధర రూ.10లక్షల నుంచి రూ.12లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‍లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో మారుతీ సుజుకీ.. దీన్ని లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. మహీంద్రా థార్, ఫోర్స్ కుర్ఖా మోడళ్లతో ఈ మారుతీ సుజుకీ జిమ్నీ పోటీ పడనుంది.

Whats_app_banner