Maruti Brezza CNG vs Grand Vitara CNG : ఈ రెండు సీఎన్​జీ కార్లలో ఏది బెటర్​?-maruti brezza vs grand vitara which cng suv model is more fuel efficient check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maruti Brezza Vs Grand Vitara: Which Cng Suv Model Is More Fuel Efficient? Check Details Here

Maruti Brezza CNG vs Grand Vitara CNG : ఈ రెండు సీఎన్​జీ కార్లలో ఏది బెటర్​?

Sharath Chitturi HT Telugu
Mar 23, 2023 04:43 PM IST

Maruti Brezza CNG vs Grand Vitara CNG : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా సీఎన్​జీ, బ్రెజ్​ సీఎన్​జీల్లో ఏది కొనాలో మీకు అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే..

మారుతీ బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ గ్రాండ్​ విటారా సీఎన్​జీ.. ఏది బెటర్​?
మారుతీ బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ గ్రాండ్​ విటారా సీఎన్​జీ.. ఏది బెటర్​?

Maruti Brezza CNG vs Grand Vitara CNG : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ.. సీఎన్​జీ లాంచ్​లతో దూసుకెళుతోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే 10కిపైగా సీఎన్​జీ మోడల్స్​ మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. సీఎన్​జీ సెగ్మెంట్​లో మారుతీ సుజుకీ లాంచ్​ చేసిన గ్రాండ్​ విటారా మోడల్​.. తొలి కాంపాక్ట్​ ఎస్​యూవీగా నిలిచింది. ఇక తొలి సీఎన్​జీ సబ్​కాంపాక్ట్​ ఎస్​యూవీగా మారుతీ బ్రెజా నిలిచింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్​జీని మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా సీఎన్​జీ మోడల్​తో పోల్చి.. ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్​ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ గ్రాండ్​ విటారా సీఎన్​జీ- ఇంజిన్​..

Maruti Brezza CNG on road price in Hyderabad : మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్​జీలో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 88పీఎస్​ పవర్​ను, 121.5 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ ఎంటీ గేర్​బాక్స్​ ఉంటుంది.

Maruti Grand Vitara CNG on road price Hyderabad : ఇక మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా సీఎన్​జీలో 1.5 లీటర్​ మైల్డ్​ హైబ్రీడ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 87.83 పీఎస్​ పవర్​ను, 121.5 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ ఎంటీ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది.

మారుతీ బ్రెజా సీఎన్​జీ కేజీకి 25.52 కి.మీల మైలేజ్​ ఇస్తుండగా.. మారుతీ గ్రాండ్​ విటారా కేజీ ఫ్యూయెల్​తో 26.6 కి.మీల దూరం ప్రయాణిస్తుంది (ఇవి కంపెనీ చెప్పిన లెక్కలు. వాస్తవంలో మైలేజ్​ మారే అవకాశం ఉంటుంది.)

మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ గ్రాండ్​ విటారా సీఎన్​జీ- ఫీచర్స్​..

Maruti Brezza CNG price : ఈ రెండు సీఎన్​జీ మోడల్స్​లోనూ 9 ఇంచ్​ టచ్​స్క్రీన్​, ఆండ్రాయిడ్​ ఆటో, క్రూజ్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ ఎయిర్​ కండీషనింగ్​, ఈఎస్​పీ, హిల్​ హోల్డ్​ అసిస్ట్​, రేర్​ పార్కింగ్​ కెమెరా వంటి ఫీచర్స్​ ఉన్నాయి. బ్రెజ్​ సీఎన్​జీ టాప్​ ఎండ్​ మోడల్​లో డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​తో పాటు సింగిల్​ పేన్​ సన్​రూఫ్​ కూడా లభిస్తోంది.

మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ గ్రాండ్​ విటారా సీఎన్​జీ- ధరలు..

Maruti Grand Vitara CNG mileage : మారుతీ బ్రెజా సీఎన్​జీ మోడల్​ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుండగా.. గ్రాండ్​ విటారా సీఎన్​జీ మోడల్​ కేవలం 2 వేరియంట్లలోనే అందుబాటులో ఉంది.

మారుతీ బ్రెజా ఎల్​ఎక్స్​ఐ సీఎన్​జీ ధర రూ. 9.14లక్షలు. వీఎక్స్​ఐ సీఎన్​జీ ధర రూ. 10.50లక్షలు. జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ ధర రూ. 11.90లక్షలు. జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ డీటీ ధర రూ. 12.06లక్షలు.

Maruti Brezza CNG mileage : మరోవైపు మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా డెల్టా సీఎన్​జీ ధర రూ. 12.85లక్షలు. జెటా సీఎన్​జీ ధర రూ. 14.84లక్షలు

* పైన చెప్పిన ధరలు ఎక్స్​షోరూం ప్రైజ్​లు.

WhatsApp channel

సంబంధిత కథనం