Stock Market: మళ్లీ నష్టాల బాటన మార్కెట్; 79 వేల కన్నా దిగువకు సెన్సెక్స్
Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం మరోసారి కుప్పకూలింది. బెంచ్ మార్క్ సూచీ అయిన సెన్సెక్స్ 79 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 208 పాయింట్లు లేదా 0.85 శాతం క్షీణించి 24,139 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 79,000 దిగువకు, నిఫ్టీ 24,200 దిగువకు పడిపోవడంతో భారత మార్కెట్లు ఆగస్టు 13 మంగళవారం సుమారు 1 శాతం పడిపోయాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఈ క్షీణత నమోదైంది. దీనికి తోడు దేశం వెలుపలకు విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం, మిశ్రమ ప్రపంచ మార్కెట్ ధోరణులు కూడా దేశీయ ఈక్విటీల్లో ప్రతికూల సెంటిమెంట్ కు దోహదం చేశాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కు భారీ దెబ్బ
ఎంఎస్సీఐ రీబ్యాలెన్సింగ్ ప్రకటన తరువాత బ్లూచిప్ కంపెనీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5 శాతం పడిపోయి, మంగళవారం సూచీల పతనానికి గణనీయంగా దోహదం చేసింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 692.89 పాయింట్లు లేదా 0.87 శాతం పెరిగి 78,956.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 208 లేదా 0.85 శాతం క్షీణించి 24,139 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం నష్టపోయాయి.
ఐఐపీ డేటా ప్రభావం
మిశ్రమ అంతర్జాతీయ సెంటిమెంట్ల మధ్య దేశీయ మార్కెట్ ద్వితీయార్థంలో ఎరుపు రంగులోకి పడిపోయింది. ఇటీవలి ఐఐపీ డేటా ప్రధాన తయారీ రంగంలో మందకొడి వృద్ధిని సూచిస్తుంది. ఎఫ్ఐఐల నిరంతర అమ్మకాలు, పెరిగిన వాల్యుయేషన్లు క్షీణతకు మరింత దోహదం చేస్తున్నాయి. అన్ని రంగాలు, ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్స్, టెలికాం, ఎరువులు ఎరుపు రంగులో ముగిశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ లు 1.2 నుంచి1.9 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 1.6 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1 శాతం, నిఫ్టీ మీడియా 0.95 శాతం, నిఫ్టీ ఆటో 0.78 శాతం, నిఫ్టీ రియల్టీ 0.73 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.28 శాతం నష్టపోయాయి.
స్వల్ప లాభాల్లో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ హెల్త్ కేర్
నిఫ్టీ ఐటీ, నిఫ్టీ హెల్త్ కేర్ సూచీలు ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ 1.87 శాతం నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో పాటు శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్విస్ట్, పీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ కూడా 2.5 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లో బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్ 1 నుంచి 2.3 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ లో హింద్ జిన్స్ 5.2 శాతం, వెల్స్పన్ కార్ప్, సెయిల్, నాల్కో, ఎన్బీడీసీ 2.5 శాతానికి పైగా నష్టపోయాయి. టైటాన్, హెచ్సీఎల్ టెక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ బీఎస్ఈలో టాప్ 5 గెయినర్స్గా నిలవగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ టాప్ 5 లూజర్స్ గా నిలిచాయి.
కొనసాగుతున్న కరెక్షన్ దశ
కరెక్షన్ దశ కొనసాగడంతో స్టాక్ మార్కెట్లు (stock market) దాదాపు ఒక శాతం నష్టపోయాయి. ఫ్లాట్ ఆరంభం ఉన్నప్పటికీ నిఫ్టీ క్రమంగా క్షీణించి 24,140.70 వద్ద రోజు కనిష్టానికి సమీపంలో ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ హెవీవెయిట్స్ పడిపోవడం, ఐటీ దిగ్గజాలు నష్టాలను పరిమితం చేయడానికి ప్రయత్నించడం ఈ ఒత్తిడికి ప్రధాన కారణం. విస్తృత సూచీలు కూడా 0.8 శాతం నుంచి 1.3 శాతం వరకు క్షీణించాయి. సెన్సెక్స్ (sensex) సెషన్ అంతటా నష్టాలను పెంచుకుని 208 పాయింట్ల నష్టంతో 24,139.00 వద్ద రోజును ముగించింది. ఐటీ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్స్ స్వల్పంగా లాభపడగా, స్మాల్ క్యాప్ 1 శాతానికి పైగా నష్టంతో ముగిసింది.