SAIL Recruitment : సెయిల్​లో ఉద్యోగాలు.. రిక్రూట్​మెంట్​ పూర్తి వివరాలివే-sail recruitment 2023 apply for 41 managerial posts check notification here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sail Recruitment : సెయిల్​లో ఉద్యోగాలు.. రిక్రూట్​మెంట్​ పూర్తి వివరాలివే

SAIL Recruitment : సెయిల్​లో ఉద్యోగాలు.. రిక్రూట్​మెంట్​ పూర్తి వివరాలివే

Sharath Chitturi HT Telugu

SAIL Recruitment : సెయిల్​ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ మొదలైంది. పోస్టుల వివరాలు, అప్లికేషన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

సెయిల్​లో ఉద్యోగాలు.. రిక్రూట్​మెంట్​ పూర్తి వివరాలివే

SAIL Recruitment latest news : వివిధ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ నిర్వహిస్తోంది స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (సెయిల్​). అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. 2024 జనవరి 11తో ముగుస్తుంది. ఈ దఫా సెయిల్​ రిక్రూట్​మెంట్​లో మొత్తం 41 పోస్టులను భర్తీ చేస్తోంది సంస్థ. అభ్యర్థులు.. sail.co.in లోకి వెళ్లి తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

సెయిల్​ రిక్రూట్​మెంట్​ వివరాలు..

వేకెన్సీలు:- ఏజీఎం (ఈ-5) (మెకానికల్​/ ఎలక్ట్రికల్​/ సివిల్​)- 7 పోస్టులు.

ఏజీఎం (ఈ-5) (ప్రాజెక్ట్స్​)- 5 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (మెకానికల్​/ సివిల్​/ ఎలక్ట్రికల్​)- 12 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (మెటలర్జీ)- 2 పోస్టులు.

మేనేజర్​ (మెకానికల్​- హైడ్రాలిక్స్​) (ఈ-3)- 2 పోస్టులు.

SAIL Recruitment 2023 apply online : మేనేజర్​ (ఈ-3) (ఐటీ)- 3 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (మైన్స్​) (ఓడీఓఎంలకు మాత్రమే)- 3 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (ప్రాజెక్ట్స్​)- 5 పోస్టులు.

డిప్యూటీ మేనేజర్​ (ఈ-2) (పీ అండ్​ హెచ్​ఎస్​)- 1 పోస్టు.

అసిస్టెంట్​ మేనేజర్​ (ఈ-1) (జియోలాజీ) (ఓజీఓఎంలకు మాత్రమే)- 1 పోస్టు.

SAIL Recruitment 2024 apply online : ఎలిజెబులుటీ:- సెయిల్​ రిక్రూట్​మెంట్​ కోసం అప్లై చేయాలని చూస్తున్న వారు అర్హత వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్​ని చూడాల్సి ఉంటుంది. నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సెలక్షన్​ ప్రక్రియ:- తొలుత.. కంప్యూటర్​ ఆధారిత టెస్ట్- ఇంటర్వ్యూ ఉంటాయి. లేదా కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉండొచ్చు.

అప్లికేషన్​ ఫీజు:- జెనరల్​, ఓబీసీ, ఈటీబ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ. 700. ఎస్​సీ, ఎస్​టీ, ఈఎస్​ఎం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 200.

ఐసీఎస్​ఎస్​ఆర్​ రిక్రూట్​మెంట్​ వివరాలు..

ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ సోషల్​ సైన్స్​ రీసెర్చ్​ (ఐసీఎస్​ఎస్​ఆర్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. పూర్తి వివరాలు..

ICSSR Recruitment 2023 : వేకెన్సీలు:- ఈ దఫా ఐసీఎస్​ఎస్​ఆర్ రిక్రూట్​మెంట్​లో 35 పోస్టులు భర్తీకానున్నాయి. వీటిల్లో 8 అసిస్టెంట్​ డైరక్టర్​ (రీసెర్చ్​) పోస్టులు, 14 రీసెర్చ్​ అసిస్టెంట్​ పోస్టులు, 13 లోవర్​ డివిజన్​ క్లర్క్​ పోస్టులు ఉన్నాయి.

వయస్సు పరిమితి:- ఐసీఎస్​ఎస్​ఆర్ రిక్రూట్​మెంట్​లో రీసెర్చ్​ అసిస్టెంట్​- లోయర్​ డివిజన్​ క్లర్క్​ పోస్టులకు అప్లై చేస్తున్న వారి వయస్సు 18-28ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక మిగిలిన పోస్టుల గరిష్ఠ వయస్సు పరిమితి 40ఏళ్లుగా ఉంది.

ICSSR Recruitment 2023 apply online : విద్యార్హత:- లోయర్​ డివిజన్​ క్లర్క్​- సెకండరీ ఎడ్జ్యుకేషన్​తో పాటు టైపింగ్​ స్పీడ్​ కనీసం 30 డబ్ల్యూపీఎం ఉండాలి.

రీసెర్చ్​ అసిస్టెంట్​- కనీసం 50శాతం మార్కులతో ఎం.ఏ డిగ్రీ ఉండాలి.

అసిస్టెంట్​ డైరక్టర్​ (రీసెర్చ్​)- సోషల్​ సైన్స్​ విభాగంలో హై సెకండ్​ క్లాస్​ మాస్టర్స్​ డిగ్రీ ఉండాలి. టీచింగ్​లో కనీసం 3ఏళ్ల ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి. లేదా రీసెర్చ్​ అడ్మినిస్ట్రేషన్​లో కనీసం 3ఏళ్ల ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి.

ఇతర వివరాల కోసం icssr.org వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.