Mahindra XUV700 Blaze Edition : మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొత్త ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే!
Mahindra XUV700 Blaze Edition : మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. దీని పేరు ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్. ఈ మోడల్ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Mahindra XUV700 Blaze Edition price : మహీంద్రా తమ పాప్యులర్ ఎస్యూవీ.. మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కొత్త, స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. బ్లేజ్ ఎడిషన్‌గా పిలిచే దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.24.24 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్లేజ్ ఎడిషన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లతో మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ ఏటీ, డీజిల్ ఏటీ, ఎంటీ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. 2024 మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ కాస్మొటిక్ మార్పులతో మాత్రమే వస్తుంది. మహీంద్రా ఎస్‌యూవీలో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు.
మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్..
మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ కొత్త మ్యాట్ బ్లేజ్ రెడ్ కలర్లో నపోలీ బ్లాక్ హైలెట్స్‌తో రూపుదిద్దుకుంది. కాబట్టి.. రూఫ్, రేర్ వ్యూ అద్దాలు, గ్రిల్, అల్లాయ్ వీల్స్ నల్లగా ఉంటాయి. ఇంటీరియర్‌లో కూడా కొన్ని కాస్మొటిక్ మార్పులు ఉన్నాయి. క్యాబిన్ ఇప్పుడు నలుపు రంగులో ఉంటుంది. ఇది కొంచెం స్పోర్టీ అపీల్ ఇస్తుంది.
ఇది కాకుండా, ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులోని పెట్రోల్ ఇంజిన్.. గరిష్టంగా 200బీహెచ్పీ పవర్‌ని, 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్.. 184బిహెచ్పీ పవర్, 450 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. గేర్ బాక్స్ ఆప్షన్స్ 6-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎస్యూవీ ధర రూ.13.99 లక్షల నుంచి రూ.26.99 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.
మహీంద్రా ఎస్‌యూవీల జోరు..
Mahindra XUV700 on road price Hyderabad : మహీంద్రా అండ్ మహీంద్రా 2024 ఏప్రిల్‌లో భారత మార్కెట్లో మొత్తం 41,008 ఎస్‌యూవీలను విక్రయించినట్లు ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా భారత ప్యాసింజర్ వాహన మార్కెట్.. ఎస్‌యూవీల కోసం విపరీతమైన డిమాండ్ ఎదుర్కొంటున్న సమయంలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజానికి ఈ అమ్మకాలు పెరిగడం విశేషం. ఎస్యూవీ అంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా అండ్ మహీంద్రాగా మారింది పరిస్థితి.
యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 41,542 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. రాబోయే నెలల్లో కూడా ఈ అమ్మకాల జోరును కొనసాగించాలని వాహన తయారీ సంస్థ భావిస్తోంది. అందుకోసం మహీంద్రా కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ..
Mahindra XUV 3XO : గత కొన్ని రోజులుగా మహీంద్రా అండ్ మహీంద్రా ఊరిస్తూ వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ.. ఇండియా మార్కెట్లో కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఇది.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ధర రూ.7.49 లక్షల వద్ద ప్రారంభమై.. రూ. 15.49 లక్షల వరకు వెళుతుంది. ఇవి ఎక్స్‌షోరూం ధరలు. లాంచ్ నేపథ్యంలో.. ఈమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం