Lava Yuva 5G : బడ్జెట్ ఫ్రెండ్లీ లావా యువ 5జీ లాంచ్ డెట్ ఫిక్స్..
Lava Yuva 5G price : సొగసైన డిజైన్, ఏఐతో కూడిన డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్తో యువ 5జీ స్మార్ట్‌ఫోన్.. భారత్లో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్..
Lava Yuva 5G specs : దేశీయ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ లావా.. తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ లావా యువ 5జీని భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ 5జీ-ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ని హైలైట్ చేసే టీజర్‌ని సంస్థ విడుదల చేసింది. ఇందులోనే స్మార్ట్‌ఫోన్ లాంచ్‌పై ఒక అప్డేట్ ఇచ్చింది. మే 30న మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల కానుంది లావా యువ 5జీ. అమెజాన్ ద్వారా దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.
లావా యువ 5జీ స్పెసిఫికేషన్స్ ఇవే..!
హోల్ పంచ్ డిస్ప్లే, మృదువైన రౌండ్ ఇంచెస్, ఫ్లాట్ ఫ్రేమ్‌తో స్మార్ట్‌ఫోన్ సొగసైన డిజైన్‌ను టీజర్ వీడియో చూపిస్తుంది. డివైస్ వెనుక భాగంలో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇది డ్యూయెల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. దీనికి ఏఐ పవర్ ఇచ్చింది సంస్థ. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ మ్యాట్ ఆకృతితో పూర్తయింది. లావా లోగోతో పాటు 5జీ చిహ్నం కింద చివరి భాగంలో నిలువుగా కనిపిస్తుంది.
అంతేకాకుండా, లావా యువ 5జీ గీక్‌బెంచ్ ప్లాట్ఫామ్లో ఎల్ఎక్స్ఎక్స్ 513 మోడల్ నంబర్ కింద కనిపించింది. ఫలితంగా.. దీని కొన్ని కీలక స్పెసిఫికేషన్లను బయటకి వచ్చాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేసే ఈ ఫోన్.. 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్‌ను అందించనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ లేదా డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ, 2.4 గిగాహెర్ట్జ్ వద్ద రెండు హై-పెర్ఫార్మెన్స్ కోర్స్, 2.0 గిగాహెర్ట్జ్ వద్ద ఆరు ఎఫిషియెన్సీ కోర్స్ కలిగి ఉంటుంది.
Lava Yuva 5G price : లావా యువ 5జీలో శక్తివంతమైన రియర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ధర విషయానికొస్తే.. ఇది మార్కెట్లో సరసమైన ఎంపిక అని భావిస్తున్నారు. ఇది భారతదేశంలో రూ .10,000 కంటే తక్కువ ధర కలిగి ఉండవచ్చు. అంటే.. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అవుతుంది.
ప్రస్తుతం ఇవి రూమర్స్‌గానే ఉన్నాయి. లాంచ్ టైమ్‌కి.. లావా యువ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
హానర్ మ్యాజిక్ 6 ప్రో..
Honor Magic 6 Pro price in India : మరోవైపు.. హానర్ మ్యాజిక్ 6 ప్రోపై ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి బజ్ నెలకొంది. ఈ ఫ్లాగ్షిప్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్లో లాంచ్ అవుతుందని హెచ్‌టీ టెక్ ధ్రువీకరించింది. అధికారిక ధృవీకరణతో పాటు, కొత్త అమెజాన్ ఇండియా లిస్టింగ్ ఈ ఫోన్ గురించి అనేక కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. వీటిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్ (ప్రత్యేక హానర్ డిస్క్రిట్ సెక్యూరిటీ చిప్ ఎస్ 1తో జతచేశారు), 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం