KTM 890 Adventure R: అదిరేటి లుక్‍తో కేటీఎం 890 అడ్వెంచర్ ఆర్ బైక్: వివరాలివే
KTM 890 Adventure R: కేటీఎం 890 అడ్వెంచర్ ఆర్ మోడల్.. ఇండియా బైక్ వీక్ 2022లో తళుక్కుమంది. కేటీఎం ఈ బైక్‍ను ప్రదర్శించింది.
KTM 890 Adventure R: కేటీఎం 890 అడ్వెంచర్ ఆర్ బైక్‍ను పరిచయం చేసింది పాపులర్ కంపెనీ కేటీఎం. ఆఫ్ రోడ్‍కు సూపర్‌గా సూటయ్యేలా డిజైన్ చేసిన ఈ అడ్వెంచర్ బైక్‍ను ఇండియా బైక్ వీక్ 2022లో ప్రదర్శించింది. త్వరలోనే ఇండియాలో ఈ 2023 వెర్షన్ బైక్‍ను కేటీఎం లాంచ్ చేసే అవకాశం ఉంది.
KTM 890 Adventure R: 889సీసీ ప్యార్లెల్ ట్విన్ మోటార్ ఇంజిన్‍ను కేటీఎం 890 అడ్వెంచర్ ఆర్ బైక్ కలిగి ఉంది. 8000 rpm వద్ద 108 bhp పవర్ ను, 6,500 rpm వద్ద 100 Nm పీక్ టార్క్యూను ఈ మోటార్ జనరేట్ చేస్తుంది. లోపల స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్ ఉండే 6 స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ బైక్ వస్తోంది. ఫ్రంట్‍లో డబ్ల్యూపీ యూఎస్‍డీ ఫోర్క్స్, వెనుక డబ్ల్యూపీ సోర్స్డ్ మోనోషాక్‍లను ఈ బైక్ కలిగి ఉంది. ఈ రెంటింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ ప్రోర్ ప్రొగ్రెసివ్ డాంపింగ్ సిస్టమ్ (PDS) రేర్ షాక్‍తో ఈ 890 అడ్వెంచర్ ఆర్ 2023 వెర్షన్ వస్తోంది.
డ్యుయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‍లతో..
KTM 890 Adventure R: ఫ్రంట్‍లో డ్యుయల్ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్‍తో ఈ 2023 కేటీఎం 890 అడ్వెంచర్ ఆర్ బైక్ వస్తోంది. ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్, ఏబీఎస్‍తో పాటు మరిన్ని రైడింగ్ ఫీచర్లను కలిగి ఉంది. రైజ్ అయిన హ్యాండిల్ బార్స్, నకుల్ గార్డ్స్, ఫ్లాట్ సీట్, ఎత్తుగా ఉండే ఎగ్జాస్ట్ ఉన్నాయి.
ఇన్‍స్ట్రుమెంటల్ కంట్రోల్ కోసం టీఎఫ్‍టీ స్క్రీన్ కూడా అప్‍గ్రేడ్‍ళతో వస్తోంది. ఈ స్క్రీన్ ద్వారా సెట్టింగ్‍లను, రైడింగ్ మోడ్‍లను మార్చుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది.
KTM 890 Adventure R: 890 అడ్వెంచర్ ఆర్ లాంచ్ గురించి కేటీఎం ఇంకా స్పష్టతనివ్వలేదు. వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విడుదలయ్యాక ట్రింఫ్ టైగర్ 900, డుకాటి మల్టీస్ట్రాడా లాంటి బైక్‍లకు ఈ 890 అడ్వెంచర్ ఆర్ పోటీగా నిలిచే అవకాశం ఉంది.
ఇండియా బైక్ వీక్ 2022 ఈవెంట్‍లో 1290 సూపర్ డ్యూక్ ఆర్, ఆర్‍సీ 16 మోటో జీపీ మెషిన్, కేటీఎం 450 ర్యాలీ బైక్‍లను కూడా కేటీఎం ప్రదర్శించింది.