Kinetic Green Zulu vs Ola S1X+ : ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఏది బెస్ట్?
Kinetic Green Zulu vs Ola S1X+: కైనెటిక్ గ్రీన్ జులు వర్సెస్ ఓలా ఎస్1ఎక్స్+.. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
Kinetic Green Zulu vs Ola S1X+ : దేశ 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో పోటీ మరింత పెరిగింది! కైనెటిక్ గ్రీన్ జులు ఈ-స్కూటర్ని సంస్థ తాజాగా లాంచ్ చేయడం ఇందుకు కారణం. ఈ మోడల్.. ఓలా ఎలక్ట్రిక్‌కి చెందిన ఓలా ఎస్1ఎక్స్+ కి గట్టిపోటనిస్తుందని మార్కెట్లో అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది కొంటే బెటర్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
కైనెటిక్ గ్రీన్ జులు వర్సెస్ ఓలా ఎస్1ఎక్స్+ - స్పెసిఫికేషన్స్..
కైనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.27 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ స్కూటర్లోని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టెమ్.. 2.8 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 104 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. 80శాతం ఛార్జింగ్‌ని 30 నిమిషాల్లో పూర్తి చేయవచ్చట! ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 60 కేఎంపీహెచ్.
Kinetic Green Zulu price : ఇక ఓలా ఎస్1ఎక్స్+ లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 151 కి.మీల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ-స్కూటర్ టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్. 0-40 కేఎంపీహెచ్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుంది.
కైనెటిక్ గ్రీన్ జులు వర్సెస్ ఓలా ఎస్1ఎక్స్+ - ధరలు..
కైనెటిక్ గ్రీన్ జులు ఎక్స్‌షోరూం ధర రూ. 94,990గా ఉంది. రూ. 69వేల వద్ద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్స్క్రిప్షన్ మొదలవుతుంది. ఇక ఓలా ఎస్1ఎక్స్+ ఈ-స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 89,999గా ఉంది. ఛార్జర్‌తో పాటు కొంటే.. ధర రూ. 1,06,779 వరకు వెళుతుంది.
ఇండియాలో కైనెటిక్ బ్రాండ్ చాలా ఫేమస్. హోండాతో కలిసి.. కైనెటిక్ హోండ్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అప్పట్లో ఈ మోడల్‌కి మంచి క్రేజ్ ఉండేది.
Ola S1X+ price in Hyderabad : ఇక ఇప్పుడు.. జులు పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని భారతీయుల ముందుకు తీసుకొచ్చింది సంస్థ. అయితే.. ఇప్పటికే 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో బీభత్సమైన పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ లాంటి దిగ్గజ సంస్థలతో పోటీ అంత ఈజీగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత కథనం