Kia EV9 vs BMW iX : కియా ఈవీ9 వర్సెస్ బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్- ఏది బెస్ట్?
Kia EV9 vs BMW iX : కియా ఈవీ9 వర్సెస్ బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్.. ఈ రెండు లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? ఇక్కడ తెలుసుకోండి.
కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత దేశ లగ్జరీ వాహనాల సెగ్మెంట్లో సంస్థ లాంచ్ చేసింది. ఈ మోడల్ ఇప్పుడు బీఎమ్డ్ల్యూ ఐఎక్స్‌తో గట్టి పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
కియా ఈవీ9 వర్సెస్ బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్: స్పెసిఫికేషన్లు..
కియా ఈవీ9 99.8 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఇది సుమారు 561 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈవీ9 మోటార్ సుమారుగా 378 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది కేవలం 5.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఛార్జింగ్ కోసం, ఈవీ9 350 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి కేవలం 24 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం బ్యాటరీ ఛార్జ్‌ని పొందవచ్చు.
మరోవైపు బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ 105.2 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. అనువైన పరిస్థితుల్లో గరిష్టంగా 635 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఐఎక్స్ 516 బీహెచ్పీ పవర్, 765 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 195 కిలోవాట్ల వద్ద డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఐఎక్స్ ను 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 35 నిమిషాలు పడుతుంది.
కియా ఈవీ9 వర్సెస్ బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్: డిజైన్, ఫీచర్స్..
కియా ఈవీ9 అనేది చాలా పెద్ద, 7 సీట్ల ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇది ఫ్యామిలీ కంఫర్ట్‌ని దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈవీ. దీని బాక్సీ డిజైన్, పెద్ద కొలతలు, బోల్డ్ లైన్లు దీనికి సాంప్రదాయ ఎస్యూవీ రూపాన్ని ఇస్తాయి. లోపల, ఈవీ9 మూడు వరుసల సీటింగ్‌తో విశాలమైన క్యాబిన్‌ను అందిస్తుంది. రెండో వరుసలో కెప్టెన్ సీట్లు, మూడో వరుసలో 60:40 నిష్పత్తిలో మొత్తం ఏడుగురు కూర్చునే స్ల్పిట్ బెంచ్ ఉంటుంది.
డ్యాష్‌బోర్డులో రెండు పెద్ద 12.3 ఇంచ్ స్క్రీన్లను అమర్చారు. ఇవి పనోరమిక్ డిజిటల్ కాక్‌పిట్‌ని తయారు చేస్తాయి. వీటిలో డ్రైవర్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ ఉన్నాయి. వెహికల్-టు-లోడ్ (వి2ఎల్), 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ వైర్లెస్ ఛార్జర్, 27 ఏడీఏఎస్ ఫీచర్లు, మెరిడియన్ సౌండ్ సిస్టెమ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ప్రత్యేకమైన డిజైన్‌తో ఫ్యూచరిస్టిక్ స్టైలింగ్‌ని మిళితం చేస్తుంది. ఐకానిక్ కిడ్నీ గ్రిల్‌తో మృదువైన, ఏరోడైనమిక్ స్టైలింగ్ పొందుతుంది. ఇంటీరియర్ అంతా లగ్జరీ, హైటెక్ ఫీచర్లతో ఉంటుంది. ఐఎక్స్లో 14.9 ఇంచ్ కర్వ్డ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. అయితే, ఐఎక్స్లో ఐదుగురు మాత్రమే కూర్చోగలరు.
ఐఎక్స్లో గెస్చర్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రేమ్-లెస్ డోర్స్, హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టెమ్, ఎయిర్ సస్పెన్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఐఎక్స్లో పార్క్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, కొలిషన్ వార్నింగ్, ఇతర ఏడీఏఎస్ కిట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
కియా ఈవీ9 వర్సెస్ బీఎండబ్ల్యూ ఐఎక్స్: ధర..
కియా ఈవీ9 ధర భారతదేశంలో రూ.1.29 కోట్లు. జీటీ-లైన్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. పెద్ద సైజు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కారణంగా ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫీచర్లతో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం చూస్తున్నవారికి అద్భుతమైన విలువను అందిస్తుంది.
మరోవైపు బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 వేరియంట్ ధర రూ.1.39 కోట్లు. ఈవీ9 బేస్ మోడల్ కంటే ఇది కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, ఐఎక్స్ బీఎమ్‌డబ్ల్యూ బ్యాడ్జ్‌ని కలిగి ఉంది. ఇది లగ్జరీ, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్. అత్యాధునిక టెక్నాలజీని సూచిస్తుంది.
సంబంధిత కథనం