Isha Ambani gives birth to twins: అంబానీ కూతురు ఇషాకు కవలలు.. పిల్లల పేర్లు ఇవే
Isha Ambani gives birth to twins: ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ కవలలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు.
ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ (HT Lifestyle)
Isha Ambani gives birth to twins: ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. ఇషా, ఆనంద్ పిరమిల్ దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 19వ తేదీన ఇషా, ఆనంద్ కవల పిల్లలను పొందారని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నామని అంబానీ కుటుంబం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
“2022 నవంబర్ 19న మా పిల్లలు ఇషా, ఆనంద్ కవలలను పొందారన్న విషయాన్ని పంచుకునేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆడపిల్లకు ఆదియా, మగపిల్లాడికి కృష్ణ అని పేరు పెట్టాం. ఇషా, పిల్లలు చాలా క్షేమంగా ఉన్నారు” అని అంబానీ ఫ్యామిలీ పేర్కొంది.
ఇషా అంబానీ, పిరమల్ ఆనంద్‍కు 2018 డిసెంబర్ 12న వివాహమైంది. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అంబానీ, పిరమల్ కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
టాపిక్
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.