Small saving schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులకు ఇకపై ఇన్ కం ప్రూఫ్ తప్పని సరి
Small saving schemes: క్రమం తప్పని ఆదాయానికి, సురక్షితమైన పెట్టుబడులకు చిన్నమొత్తాల పొదుపు పథకాలు పెట్టింది పేరు. అయితే, ఇకపై రూ. 10 లక్షలకు పైగా ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారు తమ ఆదాయ మార్గాలను వెల్లడించాల్సి ఉంటుంది.
Small saving schemes: క్రమం తప్పని ఆదాయానికి, సురక్షితమైన పెట్టుబడులకు చిన్నమొత్తాల పొదుపు పథకాలు పెట్టింది పేరు. అయితే, ఇకపై రూ. 10 లక్షలకు పైగా ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారు తమ ఆదాయ మార్గాలను వెల్లడించాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ల్లోని పొదుపు పథకాల ద్వారా అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధం చేసుకోవడాన్ని నిరోధించడానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా చూడడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Department of Posts notification: పోస్టల్ విభాగం నోటిఫికేషన్
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో రూ. 10 లక్షలు, లేదా ఆ పైన డిపాజిట్ చేసే ఖాతాదారుల వివరాలు సేకరించాలని, వారి వద్ద వారి ఆదాయాన్ని నిర్ధారించే రుజువులను తీసుకోవాలని పోస్టల్ విభాగం తమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ యూనిట్ - ఇండియా (FIU-IND), ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) లు జారీ చేసిన నిబంధనల మేరకు ఈ ఆదేశాలు పంపిస్తున్నట్లు వెల్లడించింది. అన్ని జాతీయ పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ మెంట్లను ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కొత్తగా జారీ చేసిన నిబంధనల వల్ల పోస్ట్ ఆఫీస్ లకు కూడా తమ కస్టమర్ల వివరాలు సమగ్రంగా తెలుస్తాయని పేర్కొంది. ఆయా పథకాల్లో పెట్టుబడుల మొత్తం ఆధారంగా కస్టమర్లను మూడు కేటగిరీలుగా విభజించారు. అవి
- లో రిస్క్ కేటగిరీ (Low Risk category): పోస్ట్ ఆఫీస్ లో పొదుపు పథకానికి సంబంధించి ఖాతా తెరిచినా, సేవింగ్స్ సర్టిఫికెట్ కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటికే తెరిచి ఉన్న ఖాతాలో నగదు జమ చేయాలన్నా.. వారు జమ చేసే మొత్తం రూ. 50 వేల లోపు ఉంటే, లేదా వారి ఖాతాలోని మొత్తం అమౌంట్ రూ. 50 వేల లోపు ఉంటే అది ‘లో రిస్క్ కేటగిరీ (Low Risk category) ’ కిందకు వస్తుంది.
- మీడియం రిస్క్(Medium Risk category): పోస్ట్ ఆఫీస్ లో పొదుపు పథకానికి సంబంధించి ఖాతా తెరిచినా, సేవింగ్స్ సర్టిఫికెట్ కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటికే తెరిచి ఉన్న ఖాతాలో నగదు జమ చేయాలన్నా.. వారు జమ చేసే మొత్తం రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు ఉన్నా లేదా వారి ఖాతాలోని మొత్తం అమౌంట్ రూ. 10 లక్షల లోపు ఉంటే అది ‘మీడియం రిస్క్ కేటగిరీ (Medium Risk category) ’ కిందకు వస్తుంది.
- హై రిస్క్ (High Risk category): పోస్ట్ ఆఫీస్ లో పొదుపు పథకానికి సంబంధించి ఖాతా తెరిచినా, సేవింగ్స్ సర్టిఫికెట్ కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటికే తెరిచి ఉన్న ఖాతాలో నగదు జమ చేయాలన్నా.. వారు జమ చేసే మొత్తం రూ. 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నా లేదా వారి ఖాతాలోని మొత్తం అమౌంట్ రూ. 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నా.. అది ‘హై రిస్క్ కేటగిరీ (High Risk category) ’ కిందకు వస్తుంది.
- ఈ మూడు కేటగిరీల ఖాతాదారులు తమ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు రెండింటిని పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుంది.
- ఐడీ ప్రూఫ్ గా ఆధార్ నెంబర్ ను, ఆధార్ కార్డు లేని వారు ఆధార్ ఎన్ రోల్ మెంట్ నెంబర్ ను అందజేయాల్సి ఉంటుంది.
- రూ. 50 వేలకు మించి డిపాజిట్ చేస్తున్నవారు, లేదా తమ ఖాతాలో రూ. 50 వేల కన్నా ఎక్కువ ఉన్నవారు తమ పాన్ నెంబర్ ను లేదా పాన్ లేని వారు ఫామ్ 60 ని అందజేయాల్సి ఉంటుంది.
High Risk category : ఇన్ కం ప్రూఫ్ గా ఇవి కావాలి..
- హై రిస్క్ కేటగిరీ (High Risk category) లో ఉన్నవారు తమ ఇన్ కం ప్రూఫ్ ను చూపాలి. అవి..
- ఆదాయం పొందిన వివరాలున్న బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పోస్ట్ ఆఫీస్ స్టేట్మెంట్.
- గత మూడు సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరానికి సంబందించిన ఐటీ రిటర్న్స్ ప్రూఫ్ ఇవ్వాలి.
- సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, సక్సెషన్ సర్టిఫికెట్
- ఆదాయ మార్గాన్ని తెలిపే మరేదైనా రుజువు