Hyundai Verna 2023 bookings : సరికొత్తగా హ్యుందాయ్ వెర్నా.. బుకింగ్స్ షురూ
Hyundai Verna 2023 bookings : హ్యుందాయ్ వెర్నా లేటెస్ట్ వర్షెన్ త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కొన్ని డీలర్షిప్ షోరూమ్‌లలో బుకింగ్స్ కూడా మొదలైపోయాయి..!
2023 Hyundai Verna bookings : కొన్నేళ్ల క్రితం లాంచ్ అయిన 'వెర్నా' మోడల్‌తో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ భారీ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు వెర్నాను సరికొత్తగా తీసుకురాబోతోంది! అతి త్వరలోనే.. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో 2023 హ్యుందాయ్ వెర్నా లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ కాంపాక్ట్ సెడాన్‌కు సంబంధించిన బుకింగ్స్ కొన్ని డీలర్షిప్ షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి.
వోక్స్వ్యాగన్.. స్కోడాకు పోటీగా..!
ఈ నెక్స్ట్ జెన్ హ్యుందాయ్ వెర్నాకు బీఎన్7ఐ అని కోడ్‌నేమ్ పెట్టింది ఆ సంస్థ. కాగా కొన్ని డీలర్షిప్ షోరూమ్‌లలో మాత్రమే అనధికారికంగా బుకింగ్స్ సాగుతున్నట్టు సమాచారం. 2023 హ్యుందాయ్ వెర్నాలో డిజైన్, టెక్నాలజీ పరంగా మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. వోక్స్వ్యాగన్ వర్టూస్, స్కోడా స్లావియా, హోండా సిటీ వంటి మోడల్స్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా హ్యుందాయ్ దీనిని రూపొందిస్తున్నట్టు సమాచారం.
2023 Hyundai Verna price : ఇక 2023 హ్యుందాయ్ వెర్నాలో వైడ్ గ్రిల్స్, స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, అసెంచుయేటెడ్ లైన్స్, వ్రాప్అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్‌తో పాటు మరిన్ని ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఐయానిక్ 5తో పోలి ఉండే డ్యుయెల్ స్క్రీన్.. క్యాబిన్లో ఉండొచ్చు. ఏడీఏఎస్ సేఫ్టీ, స్పాట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్‌తో పాటు మరిన్ని ఫీచర్స్ దీనికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
హ్యుందాయ్ వెర్నా ఇంజిన్..
నెక్స్ట్ జెన్ వెర్నా డైమెన్షన్ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది. సెకెండ్ రోలో ఇంకాస్త స్పేస్ ఉండొచ్చు. మరోవైపు ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ వంటి ఇంజిన్ ఆప్షన్లు ఉండొచ్చు. ప్రస్తుత వెర్నా మోడల్లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను డిస్కంటిన్యూ చేసింది హ్యుందాయ్.
Next generation Hyundai Verna launch : 2023 హ్యుందాయ్ వెర్నా.. ఇండియాలోనే తయారవుతున్నట్టు సమాచారం. లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్‌తో పాటు మరిన్న దేశాలకు దీనిని ఇండియా నుంచి ఎగుమతి చేసేందుకు హ్యుందాయ్ చూస్తున్నట్టు తెలుస్తోంది.
సరికొత్త హ్యుందాయ్ వెర్నాకు సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. రానున్న రోజుల్లో దీనిపై హ్యుందాయ్ నుంచి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాంచ్ డేట్‌ని కూడా సంస్థ ప్రకటించాల్సి ఉంది.
Hyundai Verna on road price Hyderabad : సెడాన్ మోడల్స్‌లో గతంలో హ్యుందాయ్ వెర్నాకు మంచి డిమాండ్ కనిపించింది. ఇక ఇప్పుడు సరికొత్తగా వెర్నా వస్తుండటంతో ఆటోమొబైల్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.