Tata Tigor EV 2022: లేటెస్ట్ ఫీచర్స్‌తో టాటా టిగోర్ ఈవీ లాంచ్
Tata Tigor EV 2022: టాటా టిగోర్ ఈవీ 2022 వెర్షన్ సరికొత్తగా ముస్తాబైంది.
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్‌లోని టాటా టిగోర్ ఈవీకి 2022 వెర్షన్ లాంచ్ చేసింది. ఈ కార్ ఇప్పుడు ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చింది. 2022 టిగోర్ ఈవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్ఈ, ఎక్స్‌టీ, ఎక్స్‌జడ్ ప్లస్, ఎక్స్‌జడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్లలో ఆకట్టుకోనుంది. పైగా ఇదివరకే టిగోర్ ఈవీ కొనుగోలు చేసిన వారికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా పలు ఫీచర్లను ఉచితంగా అప్‌గ్రేడ్ చేయనుంది. నెక్సాన్ ఈవీ ప్రైమ్‌లో కూడా ఇదివరకు ఇలాగే చేసింది.
2022 టాటా టిగోర్ సరికొత్తగా మాగ్నెటిక్ రెడ్ కలర్‌తో లభిస్తుంది. ఈ కలర్ ఇప్పటికే ఐసీఈ టిగోర్‌లో లభిస్తోంది. అదనంగా ఇంటీరియర్ ఇప్పుడు లెదర్ తరహా కవర్‌ను పోలి ఉంటుంది. అలాగే స్టీరింగ్ లెదర్‌తో కవర్ అయి ఉంటుంది.
ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ కలిగి ఉన్న ఈ అప్‌డేటెడ్ టిగోర్ ఈవీ 315 కి.మీ. దూరం పయనిస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టిగోర్ ఈవీ 306 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంది. అంటే సుమారు 9 కి.మీ. రేంజ్ ఇంప్రూవ్ అయ్యింది. బ్యాటరీ ప్యాక్ ఐపీ 67 రేటింగ్ కలిగి ఉంటే. అంటే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 26 కిలోవాట్ హవర్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది. టిగోర్ ఈవీలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 76 పెర్డ్‌స్టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 170 న్యూటన్ మీటర్స్ టార్క్ (లాగే శక్తి) వెలువరిస్తుంది.
ఈ టిగోర్ ఈవీ మల్టీమోడ్ రిజనరేషన్‌తో అప్‌గ్రేడ్ అయి ఉంది. ఐటీపీఎంఎస్, టైర్ పంక్షర్ రిపేర్ కిట్ కలిగి ఉంటుంది. ఎక్స్‌జడ్ ప్లస్, ఎక్స్‌జడ్ ప్లస్ డీటీ కస్టమర్లు కూడా స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ అప్‌గ్రేడ్ పొందవచ్చు. టాటా మోటార్స్ అధీకృత సర్వీస్ సెంటర్లకు వెళితే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ సేవలు డిసెంబరు 20, 2022 నుంచి లభిస్తాయి.
దేశంలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కార్ల అమ్మకాల్లో అగ్రగామిగా టాటా మోటార్స్ నిలుస్తోంది. టిగోర్ ఈవీ, టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మాక్స్ తదితర కార్ల శ్రేణితో అత్యధికంగా ఎలక్టిక్ కార్లు అమ్ముతున్న కార్ల సంస్థగా నిలిచింది.