Hyundai Price Hike: ఈ పాపులర్ కార్ల ధరను పెంచిన హ్యుండాయ్.. స్కార్పియో క్లాసిక్‍పై మహీంద్రా కూడా..
Hyundai i20, i20 N-Line: ఐ20, ఐ20 ఎన్-లైన్ హ్యాచ్‍బ్యాక్ కార్ల ధరలను హ్యుండాయ్ పెంచింది. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..
Hyundai i20, i20 N-Line Price Hike: హ్యుండాయ్ ఐ20, హ్యుండాయ్ ఐ20 ఎన్-లైన్ కార్ల ధరలు మరోసారి పెరిగాయి. ఈ ప్రీమియమ్ హ్యాచ్‍బ్యాక్ కార్ల ధరలను పెంచుతున్నట్టు హ్యుండాయ్ (Hyundai) అధికారికంగా ప్రకటించింది. ఐ20 లైనప్ కార్ల ధరలు పెరగడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఫెస్టివల్ సీజన్ ముందు సెప్టెంబర్‌లో ధరలను పెంచగా.. ఇప్పుడు మరోసారి అదే బాటపట్టింది. ఐ20 (Hyundai i20) లైనప్‍లో వేరియంట్లను బట్టి రూ.21,500 వరకు ధరలను అధికం చేసింది హ్యుండాయ్. వివరాలివే..
కొత్త ధరలు ఇలా..
Hyundai i20 Price Hike: హ్యుండాయ్ ఐ20 లైనప్‍లో టర్బో పెట్రోల్ వేరియంట్‍పై ధర గరిష్ఠంగా రూ.21,500 పెరిగింది. దీంతో ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.7.18లక్షలకు పెరిగింది. డీటీసీ ట్రాన్స్‌మిషన్‍తో కూడిన ఆస్టా (ఓ) టాప్ వేరియంట్ ధర రూ.11.68లక్షలకు చేరింది. స్పోర్టియర్ లుక్ ఉండే ఐ20 ఎన్-లైన్ (Hyundai i20 N-Line) ధరలను కూడా హ్యుండాయ్ అధికం చేసింది. రూ.16,500 వరకు ఈ వేరియంట్లపై ధర పెరిగింది. దీంతో హ్యుండాయ్ ఐ20 ఎన్-లైన్ హ్యాచ్‍బ్యాక్ ప్రారంభ ధర రూ.10.16లక్షలకు చేరింది. ఎన్-లైన్‍లో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.12.12లక్షలకు ఎగబాకింది. మిగిలిన వేరియంట్లపై కూడా ధర పెరిగింది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
Hyundai i20 Price Hike: ఐ20 లైనప్‍లో మార్పులు చేసింది హ్యుండాయ్. టర్బో పెట్రోల్ లైనప్ నుంచి ఐఎంటీ గేర్‌బాక్స్ (iMT Gearbox) వేరియంట్‍ను తొలగించింది. సిక్స్-గేర్ యూనిట్‍తో ఐఎంటీ గేర్‌బాక్స్ వెర్షన్‍ను రెండేళ్ల క్రితం హ్యుండాయ్ తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని తప్పించింది. దీంతో ఐ20 ప్రస్తుతం డీటీసీ గేర్‌బాక్స్ (DTC Gearbox) తోనే వస్తోంది. అయితే, ఎన్-లైన్ వేరియంట్ మోడళ్లలో ఐఎంటీ గేర్‌బాక్స్ ఉంటుంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ మరింత ప్రియం
Mahindra Scorpio Classic Price Hike: స్కార్పియో క్లాసిక్ ఎస్‍యూవీ ధరను మహీంద్రా సంస్థ పెంచించింది. రూ.85,000 వరకు అధికం చేసింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ ధర పెరిగిన కొద్ది రోజులకే ఈ స్కార్పి యో క్లాసిక్ ప్రైజ్ కూడా ఎగిసింది. తాజా పెంపుతో, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ వేరియంట్ ధర రూ.12.84లక్షలకు చేరింది. పెంపుదలకు ముందు వరకు ఇది రూ.11.99లక్షలుగా ఉండేది. ఇక స్కార్పియో క్లాసిక్ ఎస్11 వేరియంట్ ధర రూ.16.14లక్షలకు పెరిగింది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
మరోవైపు మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) లైనప్‍లో వివిధ వేరియంట్ల ధర కూడా రూ.64,000 వరకు అధికమైంది. బేస్ మోడల్ ధర మారకున్నా.. ఈ లైనప్‍లో మిగిలిన అన్ని వేరియంట్లపై ధర పెరిగింది.
సంబంధిత కథనం