Hyundai Aura Facelift: హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు, నయా డిజైన్‍తో..-hyundai aura facelift launched in india know specifications price features upgrade details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Aura Facelift: హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు, నయా డిజైన్‍తో..

Hyundai Aura Facelift: హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు, నయా డిజైన్‍తో..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 23, 2023 07:27 PM IST

2023 Hyundai Aura Facelift: హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ 2023 వెర్షన్ వచ్చేసింది. ఈ నయా కారు ధర, ఫీచర్లు, అప్‍గ్రేడ్‍ల వివరాలు ఇవే.

Hyundai Aura Facelift: హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ వచ్చేసింది (Photo: Hyundai)
Hyundai Aura Facelift: హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ వచ్చేసింది (Photo: Hyundai)

2023 Hyundai Aura Facelift launched: 2023 ఆరా ఫేస్‍లిఫ్ట్ మోడల్‍ను హ్యుండాయ్ మోటార్ (Hyundai Motor) సంస్థ భారత్‍లో లాంచ్ చేసింది. స్టాండర్డ్ ఆరాతో పోలిస్తే కొత్త ఫీచర్లు, కొత్త డిజైన్‍తో పాటు మరిన్ని అప్‍గ్రేడ్‍‍లతో ఈ నయా వెర్షన్ విడుదలైంది. ఈ సెడాన్‍కు మరికొన్ని సేఫ్టీ ఫీచర్లు కూడా యాడ్ అయ్యాయి. మొత్తంగా 30కు పైగా సెఫ్టీ ఫీచర్లతో ఈ 2023 హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వస్తోంది. 4 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

నయా ఫీచర్లు

2023 Hyundai Aura Facelift: ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ మేనేజ్‍మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‍ను ఈ నయా హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ కలిగిఉంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బర్‌గ్లర్ అలారమ్, ఆటోమేటిక్ హెడ్‍ల్యాంప్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి. 8.0 ఇంచుల టచ్ స్క్రీన్, వెనుక ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ చార్జర్ ఫీచర్లు కొనసాగాయి.

డిజైన్‍లో మార్పు

2023 Hyundai Aura Facelift: కిందటి మోడల్‍తో పోలిస్తే 2023 హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ సరికొత్త డిజైన్ మార్పులతో వస్తోంది. టూ పార్ట్ గ్రిల్, మరింత ఎక్కువ అప్‍రైట్ నోస్‍ను కలిగి ఉంది. ఆర్15 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఈ సెడాన్‍కు మరింత మంచి లుక్‍ను ఇస్తోంది. క్రోమ్ ఔట్‍సైడ్ డోర్ హ్యాండిల్స్, రేర్ వింగ్ స్పాయిలర్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ఫ్రంట్ బంపర్‌పై సరికొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs), బ్లాక్ రేడియేటర్ గ్రిల్‍ను ఈ నయా మోడల్ కలిగిఉంది. ఫ్రంట్ బంపర్ కూడా సరికొత్త డిజైన్‍తో వస్తోంది.

2023 Hyundai Aura Facelift: ఇంటీరియర్ విషయానికి వస్తే, సీట్లకు కొత్త ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంది. మరింత క్లాసీ లుక్‍ను ఇస్తోంది. లెదర్‌తో కూడిన స్టీరింగ్ వీల్, క్రోమ్ ఫినిష్ కాన్, పార్కింగ్ లివర్ ట్రిప్, మెటల్ ఫినిష్ ఇన్‍సైడ్ డోర్ బ్యాండిల్స్ ఉన్నాయి.

మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లు

2023 Hyundai Aura Facelift: 1.2 లీటర్ కప్పా పెట్రోల్, స్మార్ట్ ఆటో ఏఎంటీతో కూడిన 1.2 లీటర్ కప్పా పెట్రోల్, 1.2 లీటర్ బయో ఫ్యుయెల్ (సీఎన్‍జీతో పెట్రోల్) పవర్ ట్రైన్ ఆప్షన్లలో 2023 హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వస్తోంది. ఈ, ఎస్, ఎస్‍ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ), ఎక్స్+ ఏఎంటీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక స్టాండర్డ్ వేరియంట్లకు నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. హైయర్ వేరియంట్లు ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో వస్తున్నాయి.

2023 హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ ధర

2023 Hyundai Aura Facelift price: 2023 హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ కారు ప్రారంభ ధర రూ.6,29,600గా ఉంది. రూ.8,87,000లక్షల వరకు వేరియంట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ నయా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.11,000తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. సరికొత్త స్టారీ నైట్ సహా మొత్తంగా ఆరు మోనోటోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‍లలో 2023 Hyundai Aura Facelift లభిస్తుంది.

టాటా టిగోర్, హోండా అమేజ్, మారుతీ సుజుకీ డిజైర్ కార్లక ఈ 2023 హ్యుండాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ పోటీగా కనిపిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం