Hyundai Venue SUV: హ్యుండాయ్ వెన్యూ ఎస్‍యూవీకి అప్‍డేటెడ్ వెర్షన్లు.. ధరల పెంపు-hyundai hikes hyundai venue suv price hikes know new rates ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Venue Suv: హ్యుండాయ్ వెన్యూ ఎస్‍యూవీకి అప్‍డేటెడ్ వెర్షన్లు.. ధరల పెంపు

Hyundai Venue SUV: హ్యుండాయ్ వెన్యూ ఎస్‍యూవీకి అప్‍డేటెడ్ వెర్షన్లు.. ధరల పెంపు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 02, 2023 06:38 PM IST

Hyundai Venue SUV: హ్యుండాయ్ వెన్యూ ఎస్‍యూవీ అప్‍డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వెర్షన్ ధరలను రూ.25,000 వరకు పెంచింది హ్యుండాయ్. వివరాలివే..

Hyundai Price Hike: మరో కారు ధర పెంచిన హ్యుండాయ్
Hyundai Price Hike: మరో కారు ధర పెంచిన హ్యుండాయ్ (HT Auto)

Hyundai Venue SUV: కాంపాక్ట్ ఎస్‍యూవీ ‘వెన్యూ’కు అప్‍డేటెడ్ వెర్షన్‍ను హ్యుండాయ్ తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అప్‍డేటెడ్ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. కొన్ని కొత్త ఫీచర్లు కూడా యాడ్ అయ్యాయి. హ్యుండాయ్ వెన్యూ అప్‍డేటెడ్ లైనప్‍లో 8 పెట్రోల్ వేరియంట్లపై రూ.25వేల వరకు ధరలు పెంచింది హ్యుండాయ్. సైడ్ ఎయిర్ బ్యాగ్స్.. పెట్రోల్, డీజిల్ కొత్త వెర్షన్లకు యాడ్ అయ్యాయి.

Hyundai Venue SUV: హ్యుందాయ్ వెన్యూ ఎస్‍యూవీ పెట్రోల్ వేరియంట్ల ధర వివరాలు

వేరియంట్కొత్త ధరపాత ధరడిఫరెన్స్
ఈ 1.2 ఎంటీరూ.7.68 లక్షలురూ.7.62 లక్షలురూ.6వేలు
ఎస్ 1.2 ఎంటీరూ.8.90 లక్షలురూ.8.79 లక్షలురూ.11వేలు
ఎస్(0) 1.2 ఎంటీరూ.9.73 లక్షలురూ.9.58 లక్షలురూ.15వేలు
ఎస్(0) 1.0 ఐఎంటీరూ.10.40 లక్షలురూ.10.15 లక్షలురూ.25వేలు
ఎస్ఎక్స్ 1.2 ఎంటీరూ,10.89 లక్షలురూ.10.77 లక్షలు రూ.12వేలు
ఎస్(0) 1.0 డీసీటీరూ.11.36 లక్షలురూ.11.11 లక్షలురూ.25వేలు
ఎస్ఎక్స్ (0) 1.0 ఐఎంటీరూ.12.31 లక్షలురూ.12.06 లక్షలురూ.25వేలు
ఎస్ఎక్స్ (0) 1.0 డీసీటీరూ.12.96 లక్షలురూ.12.71 లక్షలురూ.25వేలు

హ్యుండాయ్ వెన్యూ ఎస్‍యూవీ పెట్రోల్ వేరియంట్ నయా వెర్షన్ ప్రారంభ ధర రూ.7.68 లక్షలకు చేరింది. టాప్ వేరియంట్ రూ.12.96లక్షలుగా ఉంది.

హ్యుండాయ్ వెన్యూ ఎస్+ 1.5 ఎం డీజిల్ వేరియంట్‍పై రూ.25వేలు పెరిగి ధర రూ.10.40లక్షలకు చేరింది. ఎస్ఎక్స్ 1.5 ఎంటీ (రూ.11.62లక్షలు), ఎస్ఎక్స్(0) 1.5ఎంటీ (రూ.12.51 లక్షలు)పై పాత ధరలే కొనసాగాయి. కొత్త వెర్షన్‍లో డీజిల్ ఇంజిన్ అప్‍డేట్ అయింది. ఇప్పుడు ఈ ఇంజిన్ 115హెచ్‍పీ వరకు గరిష్ఠ పవర్‌ను జనరేట్ చేయగలదు.

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ సపోర్ట్ ఉండే 8 ఇంచుల టచ్‍స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ డిస్‍ప్లే, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‍రూఫ్, బోస్ ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లను హ్యుండాయ్ వెన్యూ ఎస్‍యూవీ కలిగి ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత కథనం

టాపిక్