Hyundai Exter price : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వేరియంట్లు- వాటి ధరలు.. పూర్తి వివరాలివే-hyundai exter variants and their features prices full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter Price : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వేరియంట్లు- వాటి ధరలు.. పూర్తి వివరాలివే

Hyundai Exter price : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వేరియంట్లు- వాటి ధరలు.. పూర్తి వివరాలివే

Sharath Chitturi HT Telugu
Jul 21, 2023 11:24 AM IST

Hyundai Exter price : హ్యుందాయ్​ ఎక్స్​టర్​లో ఎన్ని వేరియంట్లు ఉన్నాయి? వాటి ధరల వివరాలేంటి? ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ (HT AUTO)

Hyundai Exter price : టాటా పంచ్​, నిస్సాన్​ మాగ్నైట్​కు పోటీగా.. ఇటీవలే లాంచ్​ అయిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. క్రేటా, అల్కజార్​, టుక్సన్​ వంటి హ్యుందాయ్​ ఎస్​యూవీ పోర్ట్​ఫోలియోలో చేరింది ఈ ఎక్స్​టర్​. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్​ వేరియంట్లు, వాటి ధరలు వంటి అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎన్ని వేరియంట్లు ఉన్నాయి..?

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీలో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఈఎక్స్​, ఈఎక్స్​ (ఓ), ఎస్​, ఎస్​(ఓ), ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్​(ఓ), ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​.

ఇంజిన్​ ఆప్షన్స్​ ఏంటి..?

కొత్త ఎస్​యూవీలో 1.2 లీటర్​, కప్పా పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. ఇది 83పీఎస్​ పవర్​ను, 113.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంది.

కొత్త వెహికిల్​ ఎంత మైలేజ్​ ఇస్తుంది..?

Hyundai Exter variants : ఎక్స్​టర్​ పెట్రోల్​ ఎంటీ వేరియంట్​ 19.4 కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇక పెట్రోల్​ ఏఎంటీ వేరియంట్​ మైలేజ్​ 19.2 కేఎంపీఎల్​ అని, సీఎన్​జీ ఎంటీ వేరియంట్​ మైలేజ్​ 27.1 కేఎం/కేజీ అని స్పష్టం చేస్తోంది.

ఇదీ చూడండి:- Hyundai Exter vs Nissan Magnite : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ నిస్సాన్​ మాగ్నైట్​- ఏది బెస్ట్​?

వేరింట్లు- వాటి ధరల వివరాలు..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఈఎక్స్​ ఎంటీ- రూ. 6లక్షలు

ఈఎక్స్​(ఓ) ఎంటీ- రూ. 6.25లక్షలు

ఎస్​ ఎంటీ- రూ. 7.27లక్షలు

ఎస్​(ఓ) ఎంటీ- రూ. 7.42లక్షలు

ఎస్​ ఏఎంటీ- రూ. 7.97లక్షలు

ఎస్​ఎక్స్​ ఎంటీ- రూ. 8లక్షలు

ఎస్​ఎక్స్​ ఎంటీ డ్యూయెల్​ టోన్​- రూ. 8.23లక్షలు

Hyundai Exter on road price Hyderabad : ఎస్​ఎక్స్​(ఓ) ఎంటీ- రూ. 8.64లక్షలు

ఎస్​ఎక్స్​ ఏఎంటీ- రూ. 8.68లక్షలు

ఎస్​ఎక్స్​ ఏఎంటీ డ్యూయెల్​ టోన్​- రూ. 8.91లక్షలు

ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ ఎంటీ- రూ. 9.32లక్షలు

ఎస్​ఎక్స్​ (ఓ) ఎంటీ- రూ. 9.32లక్షలు

ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ ఎంటీ డ్యూయెల్​ టోన్​- రూ. 9.42లక్షలు

ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ ఏఎంటీ- రూ. 10లక్షలు

ఎస్​ఎక్స్​ (ఓ) కనెక్ట్​ ఏఎంటీ డ్యూయెల్​ టోన్​- రూ. 10.10లక్షలు

ఎక్స్​టర్​ సీఎన్​జీ ఎస్​ ఎంటీ- రూ. 8.24లక్షలు

సీఎన్​జీ ఎస్​ఎక్స్​ ఎంటీ రూ. 8.97లక్షలు

(పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్​షోరూం ప్రైజ్​లని గుర్తుపెట్టుకోవాలి.)

Whats_app_banner

సంబంధిత కథనం